
ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్ వద్ద పెద్ది మేనియా కనిపిస్తుంది. జూన్ 4న గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో వచ్చిన ఈ చిత్రం విడుదలకు ముందు రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. బుధవారం ప్రీమియర్ షో నుంచే ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుండగా.. ఇక ఇప్పుడు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ ‘బుక్‌మై షో’ (BookMyShow) లో ‘పెద్ది’ సినిమా ఊహించని రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు గంటకు ఏకంగా 40 వేలకు పైగా టికెట్లు అమ్ముడవుతుండటం విశేషం. బుక్‌మై షో సంస్థ 2023లో ‘అవర్లీ ట్రెండింగ్’ (గంటల వారీ బుకింగ్స్) ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత… గంటకు 40 వేల టికెట్ల మార్క్‌ను అందుకున్న నాలుగో తెలుగు చిత్రంగా ‘పెద్ది’ నిలిచింది. అంతకుముందు కేవలం ‘కల్కి 2898 ఏడీ’, ‘సలార్’, ‘పుష్ప’ సినిమాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి.
ఎక్కువమంది చదివినవి : Reema Sen : ఇండస్ట్రీలో అతడే నాకు బెస్ట్ ఫ్రెండ్.. ప్రతి విషయంతో తనతోనే షేర్ చేసుకుంటాను.. రీమా సేన్..
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోనూ రామ్ చరణ్ క్రేజ్ మరోసారి నిరూపితమైంది. కర్ణాటక ప్రీమియర్ షోల కలెక్షన్లలో ‘పెద్ది’ సరికొత్త రికార్డును లిఖించింది. అక్కడ ప్రీమియర్ల ద్వారానే ఈ చిత్రం రూ. 3.2 కోట్ల గ్రాస్ వసూలు చేసి, కర్ణాటకలో అత్యధిక ప్రీమియర్ కలెక్షన్స్ సాధించిన నంబర్ వన్ టాలీవుడ్ సినిమాగా నిలిచింది. అంతకుముందు ఈ జాబితాలో టాప్‌లో ఉన్న ‘ఓజీ’ (రూ. 2.72 కోట్లు), ‘రాజా సాబ్’ (రూ. 2.61 కోట్లు), ‘పుష్ప 2’ (రూ. 2.55 కోట్లు) చిత్రాల రికార్డులను ‘పెద్ది’ బ్రేక్ చేసింది.
ఎక్కువమంది చదివినవి : Raghavendra Rao : అది గొప్ప పాట.. జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన సాంగ్.. రాఘవేంద్ర రావు మనసులో నిలిచిపోయిన పాట ఇదే..
ఇదిలా ఉండగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతంలో వచ్చిన ఈ సినిమాలోని ‘చికిరి చికిరి’ సాంగ్ యూట్యూబ్‌లో 10 కోట్లకు పైగా వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఈ పాటలోని కొన్ని పదాలను తొలగించి, దానికి బదులుగా ‘సొగసు సింగారం’ అనే పదంతో లిరిక్స్‌ను మార్చినట్లు నెటిజన్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ప్రస్తుతం థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది.
ఎక్కువమంది చదివినవి : Maheswari: ఆ హీరో అంటే క్రష్.. పిచ్చిగా ప్రేమించా.. చెల్లి అని మనసు ముక్కలు చేశాడు.. హీరోయిన్ మహేశ్వరి..
ఎక్కువమంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఒక్కో సీన్ ఊపిరి బిగపట్టి చూడాల్సిందే.. ఓటీటీలో రచ్చ చేస్తున్న మలయాళీ