Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా ?.. ఇప్పటికీ.. ఎప్పటికీ అతనే ఇష్టమట..

ఓ ఛానెల్ నిర్వహించిన కాన్‏క్లేవ్ 2023 కార్యక్రమంలో పాల్గొన్నారు మెగా పవర్ స్టార్. ఇందులో ఆర్ఆర్ఆర్ సినిమా గురించి .. తన ఫిల్మ్ కెరీయర్, ఫ్యామిలీ విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే తన ఫేవరేట్ హీరో ఎవరనేది బయటపెట్టారు.

Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా ?.. ఇప్పటికీ.. ఎప్పటికీ అతనే ఇష్టమట..
Ram Charan Hero
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 18, 2023 | 9:26 PM

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగిన 95వ అకాడమీ అవార్డ్స్ ప్రధానోత్సవంలో ఆర్ఆర్ఆర్ చిత్రం చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ పాటగా ఆస్కార్ అందుకుంది. ఈ వేడుకల కోసం గత కొన్ని రోజులుగా అమెరికాలో సందడి చేశారు ట్రిపుల్ ఆర్ టీం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఆస్కార్ వేడుకలలో పాల్గొన్నారు. అనంతరం జక్కన్న అండ్ టీం.. తారక్ నేరుగా హైదరాబాద్ చేరుకోగా.. చరణ్ మాత్రం నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ ఓ ఛానెల్ నిర్వహించిన కాన్‏క్లేవ్ 2023 కార్యక్రమంలో పాల్గొన్నారు మెగా పవర్ స్టార్. ఇందులో ఆర్ఆర్ఆర్ సినిమా గురించి .. తన ఫిల్మ్ కెరీయర్, ఫ్యామిలీ విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే తన ఫేవరేట్ హీరో ఎవరనేది బయటపెట్టారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అంటే తనకు చాలా ఇష్టమని.. అతను ఇప్పటికీ … ఎప్పటికీ తన అభిమాన హీరో అని చెప్పుకొచ్చారు.

చరణ్ మాట్లాడుతూ.. ” మా నాన్న చిరకాల స్నేహితుడు నన్ను వాళ్ల ఇంటికి రమ్మని ఆహ్వనించారు. వాళ్లిద్దరూ కలిసి గతంలో అనేక ప్రకటనలు చేశారు. అతనే మిస్టర్ సల్మాన్ ఖాన్. అతనికి నేనెప్పుడూ అభిమానినే. ఆయనకు తెలియకుండా బొంబాయిలో ఏం జరగదు. ఆయన ఇంటికి వెళ్లిన క్షణాలు ఇప్పటికీ నా హృదయంలో ఉండిపోయాయి. సల్మాన్ భాయ్.. చాలా దయగలవాడు. ” అంటూ చెప్పుకొచ్చారు చరణ్.

ప్రస్తుతం చరణ్.. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 సినిమా చేస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. కొద్ది రోజులుగా వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ చివరి దశకు చేరుకుంది. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.