Ram Charan: ఉపాసన ప్రెగ్నెన్సీపై రామ్‌ చరణ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌.. ఈ మ్యాజిక్ అంతా జపాన్‌లోనే జరిగిందంటూ..

ప్రస్తుతం ఏడునెలల గర్భంతో ఉన్న ఉప్సీ ఈ ఏడాది జూలైలో బిడ్డకు జన్మనివ్వనుంది. ఈక్షణం కోసం రామ్‌ చరణ్‌ దంపతులతో పాటు మెగా కుటుంబ సభ్యులు, అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే రామ్‌ చరణ్‌ తాజాగా శ్రీనగర్‌లో జీ20 సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Ram Charan: ఉపాసన ప్రెగ్నెన్సీపై రామ్‌ చరణ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌.. ఈ మ్యాజిక్ అంతా జపాన్‌లోనే జరిగిందంటూ..
Ram Charan, Upasana

Updated on: May 25, 2023 | 12:04 PM

టాలీవుడ్‌లో ది మోస్ట్‌ బ్యూటిఫుల్‌ అండ్‌ రొమాంటిక్‌ కపుల్‌గా రామ్‌ చరణ్‌- ఉపాసనకు పేరుంది. త్వరలోనే వీరి జీవితంలోకి మరొక రు ప్రవేశించనున్నారు. పెళ్లయిన సుమారు 12 ఏళ్ల తర్వాత ఉపాసన గర్భం ధరించింది. త్వరలోనే ఇద్దరూ అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందనున్నారు. ప్రస్తుతం ఏడునెలల గర్భంతో ఉన్న ఉప్సీ ఈ ఏడాది జూలైలో బిడ్డకు జన్మనివ్వనుంది. ఈక్షణం కోసం రామ్‌ చరణ్‌ దంపతులతో పాటు మెగా కుటుంబ సభ్యులు, అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే రామ్‌ చరణ్‌ తాజాగా శ్రీనగర్‌లో జీ20 సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇండియాలో ఈ గౌరవం దక్కించుకున్న తొలి హీరోగా చెర్రీ అరుదైన ఘనత అందుకున్నాడు. ఇదే సమ్మిట్‌లో జపాన్‌పై తనకున్న ప్రేమను చాటుకున్నారు చరణ్‌. త్వరలో తమకు పుట్టబోయే బిడ్డకు జపాన్‌తో సంబంధం ఉందని చెప్పుకొచ్చాడు. ‘నాకు జపాన్‌ చాలా ఇష్టమైన ప్రదేశం. ఆ దేశానికి నా మనస్సులో ప్రత్యేక స్థానముంటుంది. ఉపాసన ప్రెగ్నెన్సీకి సంబంధించి ఈ మ్యాజిక్‌ అంతా జపాన్‌లోనే జరిగింది’ అని చెప్పుకొచ్చాడు రామ్‌చరణ్‌.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో గేమ్‌ ఛేంజర్‌ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, అంజలి, ఎస్‌ జే సూర్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్‌ స్వరాలు సమకరూస్తుండగా, దిల్‌ రాజు నిర్మాణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..