Game Changer: ఆ ఒక్క కారణంతో రెమ్యునరేషన్ తగ్గించుకున్న రామ్ చరణ్.. ఎన్ని కోట్లు తీసుకున్నాడంటే?

|

Jan 03, 2025 | 6:06 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఎస్ జే సూర్య విలన్ గా యాక్ట్ చేశాడు.

Game Changer: ఆ ఒక్క కారణంతో రెమ్యునరేషన్ తగ్గించుకున్న రామ్ చరణ్.. ఎన్ని కోట్లు తీసుకున్నాడంటే?
Game Changer Movie
Follow us on

ప్రస్తుతం దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు. ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఘనవిజయం సాధించడంతో రామ్ చరణ్ రేంజ్ మారిపోయింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా తర్వాత నటించిన ‘ఆచార్య’ అతను నిర్మించిన సినిమానే కావడంతో పారితోషికం తీసుకోలేదు. అయితే ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు రామ్ చరణ్ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు బయటకు వచ్చిన వార్తల ప్రకారం ఈ సినిమా కోసం తన పారితోషికాన్ని బాగా తగ్గించుకున్నాడు. ఇందుకు ఒక కారణం ఉందట. ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు రామ్ చరణ్ 100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆమేరకు ఒప్పందం కూడా జరిగిందట. కానీ రామ్ చరణ్ ఇప్పుడు కేవలం 65 కోట్ల రూపాయలు మాత్రమే అందుకున్నాడని తెలుస్తోంది.

గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ తన పారితోషికాన్ని తగ్గించుకోవడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ‘గేమ్ ఛేంజర్’ సినిమా బడ్జెట్ ముందుగా రూ. 300 కోట్లు అనుకున్నారట. అయితే సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఆ బడ్జెట్ కాస్తా పెరిగి రూ. 500 కోట్ల దాకా అయ్యిందట. ఈ క్రమంలోనే నిర్మాతల శ్రేయస్సు గురించ ఆలోచించిన రామ్ చరణ్ తన పారితోషికాన్ని తగ్గించుకున్నాడట. కేవలం 65 కోట్ల రూపాయలే తీసుకున్నాడట. ఇక రామ్ చరణ్ తో పాటు దర్శకుడు శంకర్ కూడా తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడట. మొదట రూ. 50 కోట్ల ఒప్పందం జరిగితే ఇప్పుడు కేవలం రూ. 35 కోట్లే తీసుకున్నాడట.

ఇవి కూడా చదవండి

 

‘గేమ్ ఛేంజర్’ సినిమా జనవరి 10న విడుదల కానుండగా. నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. అంజలి, శ్రీకాంత్, సముద్రఖని సునీల్ తదితరలు ప్రధాన పాత్రల పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం (జనవరి 04) రాజమండ్రిలో గ్రాండ్‌గా జరగనుంది.

రేపు రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .