
మెగా కపుల్ రామ్ చరణ్-ఉపాసన మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. ఉపాసన కవలలకు జన్మనిచ్చింది. దీంతో మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా తెగ సంబరపడిపోతున్నారు. ఇక రెండో సారి అమ్మనాన్నలైన రామ్ చరణ్-ఉపాసనలకు స్టార్ సెలబ్రిటీల నుంచి అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇదే సమయంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామిపై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. మెగాభిమానులతో పాటు నెటిజన్లు ఈయనపై తెగ విమర్శలు గుప్పిస్తున్నారు. వేణు స్వామి అంచనాలు తప్పిపోయాయి. ఆయన మళ్లీ దొరికేశాడంటూ నెట్టింట పోస్టులు షేర్ చేస్తున్నారు. మరి ఇంతకు రామ్ చరణ్ దంపతుల గురించి వేణు స్వామి ఏమన్నారు? ఎందుకిలా ఆయనపై ట్రోలింగ్ జరుగుతుందో తెలుసుకుందాం రండి.
సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా పేరొందిన వేణుస్వామి గతంలో రామ్ చరణ్- ఉపాసనల కూతురు క్లింకారు జాతకం ఇదేనంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆయన ఇలా చెప్పుకొచ్చారు ‘క్లింకార పుట్టిన సమయం చాలా అద్భుతంగా ఉంది. తన జాతకంలో రాజయోగం ఉంది. ఆ అమ్మాయి మెగా కుటుంబానికి అదృష్టం తీసుకువస్తుంది. మెగాస్టార్ చిరంజీవికి గారికి ఉన్నటువంటి యోగమే ఈ పాపకు కూడా ఉంది. పాప పెరిగి పెద్దయిన తరువాత చరిత్ర సృష్టించే అవకాశాలు ఆమె జాతకంలో కనిపిస్తున్నాయి. చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసనలకు ఉన్నంత పేరు క్లింకారకు కూడా వస్తుంది’ అని వేణ స్వామి చెప్పుకొచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇదే వీడియోలో రామ్ చరణ్- ఉపాసనల గురించి ఆయన మరో షాకింగ్ విషయం కూడా చెప్పారు. క్లింకార తర్వాత ఉపాసన- రామ్ చరణ్ ల కు మరో సంతానం ఉండకపోవచ్చన్నారు. అయితే ఉపాసన ఇప్పుడు కవలలకు జన్మనిచ్చింది. అలాగే రామ్ చరణ్ దంపతులకు మగ సంతానం ఉండదని వేణుస్వామి చెప్పగా కవలల్లో ఒక బాబు కూడా పుట్టాడు. దీంతో వేణుస్వామి జోస్యం తప్పిందంటూ నెటిజన్లు, మెగాభిమానులు ఆయనను ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఉపాసన గురించి వేణు స్వామి చేసిన కామెంట్స్ కు సంబంధించిన వీడియోను మళ్లీ ట్రోల్ చేస్తున్నారు.
🦟 Actor Ram Charan’s wife Upasana has given birth to twins. When Ram Charan arrived at the hospital to see them, he was surrounded by fans.#RamCharan pic.twitter.com/sW73q5v26K
— CrazyMantri (@CrazyMantri) February 2, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.