Ram Charan: శంకర్ సినిమా బిగ్ అప్డేట్.. రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వచ్చేది అప్పుడేనా..?

|

Jan 27, 2022 | 2:01 PM

మెగా పవర్ స్టార్ సినిమా కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమాను కంప్లీట్ చేసిన చరణ్ ఇప్పుడు టాప్ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేస్తున్నాడు.

Ram Charan: శంకర్ సినిమా బిగ్ అప్డేట్.. రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వచ్చేది అప్పుడేనా..?
Follow us on

Ram Charan: మెగా పవర్ స్టార్ సినిమా కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమాను కంప్లీట్ చేసిన చరణ్ ఇప్పుడు టాప్ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక రాజమౌళి సినిమా విషయానికొస్తే.. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్  చేశాడు. మగధీర సినిమా తర్వాత జక్కన్న తో చరణ్ చేస్తున్న రెండో సినిమా ఇది. ఇక ఈ సినిమాలో చరణ్ తోపాటు యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ కూడా నటిస్తున్నా విషయం తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామ రాజుగా కనిపించనున్నాడు. అలాగే తారక్ కొమురం భీమ్ గా నటిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్లు, పాటలు, ట్రైలర్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఈ సినిమా తర్వాత టాప్ దర్శకుడు శంకర్ తో సినిమా చేయనున్నాడు చరణ్. చరణ్ కెరీర్ లో 15వ సినిమా గా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా ఇప్పటికే రెండు షడ్యూల్ ను పూర్తి చేసుకుందని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ జూన్ వరకు పూర్తిచేసుకుని దసరాకి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావొచ్చునని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమానుంచి చరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలనీ చేస్తున్నారట మేకర్స్. ఈ సినిమా ఇప్పటికే రెండు షడ్యూల్ ను పూర్తి చేసుకుందని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ జూన్ వరకు పూర్తిచేసుకుని దసరాకి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావొచ్చునని అనుకున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో, శ్రీకాంత్ .. అంజలి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.ఇదిలా ఉంటే చరణ్ జెర్సీ దర్శకుడితో సినిమా చేయనున్నాడు. జెర్సీ సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరితో చరణ్ సినిమా చేస్తున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa: ఇది వేరే లెవెల్.. శ్రీవల్లి పాటకు నాన్నమ్మతో కలిసి స్టెప్పులేసిన టీమిండియా ఆల్ రౌండర్..

Keerthy Suresh: జోరుమీదున్న కీర్తిసురేష్.. యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసిన ముద్దుగుమ్మ..

Chiranjeevi: సినిమా తారలను వదలని మహమ్మారి!! చిరంజీవికి కరోనా పాజిటివ్‌ !! వీడియో