RRR Movie: ఆర్ఆర్ఆర్ నుంచి స్పెషల్ సర్‏ప్రైజ్‏ను రివీల్ చేసిన జక్కన్న.. ఎత్తర జెండా అంటూ..

|

Mar 10, 2022 | 6:57 PM

పాన్ ఇండియా మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. (Ram Charan ). యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి

RRR Movie: ఆర్ఆర్ఆర్ నుంచి స్పెషల్ సర్‏ప్రైజ్‏ను రివీల్ చేసిన జక్కన్న.. ఎత్తర జెండా అంటూ..
RRR Movie
Follow us on

పాన్ ఇండియా మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. (Ram Charan ). యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా అంచనాలు బారీగానే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కేసులు పెరగడంతో సినిమాను వాయిదా వేశారు మేకర్స్. దీంతో మెగా నందమూరి అభిమానులు నిరాశకు గురయ్యారు. అదే సమయంలో మార్చి 25న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే విడుదల తేదీ దగ్గరపడుతున్నప్పటికీ ఇప్పుటికీ ప్రమోషన్స్ మాత్రం ప్రారంభించలేదు జక్కన్న అండ్ టీం. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై పై మరోసారి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో స్పెషల్ సర్ ప్రైజ్ రివీల్ చేశారు రాజమౌళి..

నిజానికి ఈ స్పెషల్ సర్ ప్రైజ్ ను సినిమా చివరలో ఇవ్వాలనుకున్నారట. కానీ ఎగ్జయిట్మెంట్ ఆపుకోలేక ఇప్పుడు రివీల్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు రాజమౌళి. ఇంతకీ ఆ స్పెషల్ సర్ ప్రైజ్ ఏంటీ అనుకుంటున్నారా ? అదే ఆర్ఆర్ఆర్ సెలబ్రెషన్ యాంథమ్. ‘‘ట్రిపుల్ ఆర్ సర్‌ప్రైజింగ్ యాంథ‌మ్‌ను మార్చి 14న విడుద‌ల చేయ‌బోతున్నాం. నిజానికి ఈ సెల‌బ్రేష‌న్ యాంథ‌మ్‌తో ట్రిపుర్ సినిమా చివ‌ర‌లో ఉంచి.. ప్రేక్ష‌కుల‌ను స‌ర్‌ప్రైజ్ చేయాల‌ని భావించాం. కానీ ఎగ్జ‌యిట్‌మెంట్‌ను ఆపుకోలేక‌పోతున్నాం’’ అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. ఎత్తర జెండా అంటూ సాగే ఈ ట్రిపుల్ ఆర్ సెలబ్రెషన్ యాంథమ్ మార్చి 14న రిలీజ్ కానుంది. ఈ సినిమాను తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ , తమిళ్ భాషలలో విడుదల చేయనున్నారు.

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను అంతే భారీగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ఆలియా భట్, ఓలివియా మోరిస్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సముద్రఖని, శ్రియా, అజయ్ దేవ్ గన్ ఇతర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Also Read: Sitara Gattamaneni: సితారలో ఈ టాలెంట్ కూడా ఉందా ?.. ఏకంగా బుర్జ్ ఖలీఫానే..

Rashmi Gautham: క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన రష్మి.. తేలికగా ఆ మాటలు అనేస్తుంటారు అంటూ..

Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమాను అందుకే తొందరగా రిలీజ్ చేశారా ?.. క్లారిటీ ఇదేనా…

ET Movie Review: నారీలోకానికి అవగాహన కల్పించే ప్రయత్నం చేసిన ఈటీ!..