AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: మెగా వారసుడు కసి మీదున్నాడుగా.. RC16 ఇదే ఏడాది వస్తుందా..?

RC16 Movie Update: షూటింగ్ కూడా మొదలు కాకముందే రాంచరణ్ మూవీ RC16ను నేషనల్ వైడ్ ట్రెండ్ అయిపోతోంది. ఇప్పుడు షూటింగ్ అవుతున్న కొద్దీ దేశమంతా తన సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. కేవలం ఒక్క సినిమా అనుభవంతో అద్భుతాలు చేస్తున్నాడు బుచ్చిబాబు. రేపు RC16 ఎలా ఉండబోతుందో అనే విషయం పక్కనబెడితే.. ముందు ఈ ప్రాజెక్ట్‌ను బుచ్చిబాబు సెట్ చేస్తున్న విధానానికే అందరూ ఫిదా అయిపోతున్నారు.

Ram Charan: మెగా వారసుడు కసి మీదున్నాడుగా.. RC16 ఇదే ఏడాది వస్తుందా..?
Buchibabu, Ram Charan
Praveen Vadla
| Edited By: Janardhan Veluru|

Updated on: Feb 07, 2025 | 5:03 PM

Share

ఏం చెప్తున్నాడో.. ఏం చెప్పి ఒప్పిస్తున్నాడో తెలియదు కానీ డైరెక్టర్ బుచ్చిబాబు పేరు ఇప్పుడు ఇండియా వైడ్‌గా మార్మోగిపోతోంది. షూటింగ్ కూడా మొదలు కాకముందే రాంచరణ్ మూవీ RC16ను నేషనల్ వైడ్ ట్రెండ్ చేసాడు ఈ దర్శకుడు. ఇప్పుడు షూటింగ్ అవుతున్న కొద్దీ దేశమంతా తన సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాడు బుచ్చిబాబు. ఈ చిత్ర కాస్ట్ అండ్ క్య్రూ చూస్తుంటే బుచ్చిబాబు కాస్తా బాహుబలి ఇంటర్వెల్ సీన్‌లో ప్రభాస్‌లా కనిపిస్తున్నారు. ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా అనుభవంతో అద్భుతాలు చేస్తున్నాడు బుచ్చిబాబు. రేపు RC16 ఎలా ఉండబోతుందో అనే విషయం పక్కనబెడితే.. ముందు ఈ ప్రాజెక్ట్‌ను బుచ్చిబాబు సెట్ చేస్తున్న విధానానికే అందరి బుర్ర గిర్రున తిరుగుతోంది.

చాలా మంది దర్శకులు కలలో కూడా ఊహించని కాంబినేషన్స్ RC16కి కలిపేస్తున్నాడు బుచ్చిబాబు. రామ్ చరణ్‌తో బుచ్చిబాబు ప్రాజెక్ట్ ఓకే అయినపుడే దీనిపై చర్చ మొదలైంది. అంతలోనే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటూ మరో బాంబ్ పేల్చారు బుచ్చి. ఆ షాక్ నుంచి బయటికి రాకముందే శివరాజ్ కుమార్, జాన్వీ కపూర్, దివ్యేందు అంటూ RC16 క్యాస్టింగ్ గుట్టు విప్పి మరో షాక్ ఇచ్చాడు. RC16లో రామ్ చరణ్‌ను చాలా రగ్డ్ పాత్రలో చూపించబోతున్నాడు బుచ్చి. బడ్జెట్ విషయంలో ఫ్రీడమ్ ఇవ్వడంతో.. కాస్టింగ్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు ఈ దర్శకుడు.

RC16లో కేవలం కాస్ట్ అండ్ క్య్రూకే భారీగా ఖర్చు పెడుతున్నారు. రామ్ చరణ్ రూ.100 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.  బుచ్చిబాబు, జాన్వీ కపూర్, రెహమాన్ కూడా భారీగానే తీసుకుంటున్నారట. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే భారీ షెడ్యూల్ జరుగుతుంది. ఇక రిలీజ్ విషయానికి వస్తే.. ఈ ఏడాది డిసెంబర్ లోనే RC16 విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి పెద్ది అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. గేమ్ ఛేంజర్ ఆశించిన స్థాయిని చేరుకోలేక నిరాశ  పరచడంతో.. ఇదే ఏడాది హిట్ కొట్టి ఫామ్‌లోకి రావాలనే కసితో కనిపిస్తున్నాడు మెగా వారసుడు రాంచరణ్.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..