AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakul Preet Singh: రకుల్ మెడ పై స్టిక్కర్.. వైరలవుతున్న వీడియో.. ఇంతకీ అదెంటో తెలుసా.. ?

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. తెలుగులో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత స్టార్ హీరోలతో నటించి స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ బ్యూటీ మెడపై ఓ స్టిక్కర్ కనిపిస్తున్న వీడియో నెట్టింట వైరలవుతుంది.

Rakul Preet Singh: రకుల్ మెడ పై స్టిక్కర్.. వైరలవుతున్న వీడియో.. ఇంతకీ అదెంటో తెలుసా.. ?
Rakul
Rajitha Chanti
|

Updated on: Aug 31, 2025 | 11:15 AM

Share

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగు సినిమా ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళం భాషలలో స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటుంది. కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇటీవలే మేరీ హస్బెండ్ కి బీవీ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం అజయ్ దేవగన్ నటిస్తోన్న దేదే ప్యార్ దే 2 చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలో ఆర్ మాధవన్, టబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా రకుల్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది.

ఇవి కూడా చదవండి : గ్లామర్‏లో అరాచకం.. అందం ఉన్న కలిసిరాని అదృష్టం.. క్రేజ్ పీక్స్..

ఇవి కూడా చదవండి

ఇటీవల ముంబై విమానాశ్రయంలో కనిపించింది రకుల్. ఆ సమయంలో ఆమె మెడపై ఓ స్టిక్కర్ కనిపించింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. రకుల్ మెడ పై ఉన్న స్టిక్కర్ ఏంటా ? అని తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే రకుల్ మెడపై ఉన్న స్టిక్కర్ లైఫ్ వేవ్ ఎక్స్ 39 స్టెమ్ సెల్ ప్యాచ్ అని సమాచారం. ఈ ప్యాచ్ ను ఎందుకు ఉపయోగిస్తారంటే.. శరీరంలోని స్టెమ్ సెల్స్ ఉత్తేజపరిచేందుకు రూపొందించిన వెల్ నెస్ ప్రొడక్ట్ ఇది. ఈ ప్యాచ్ ఎలాంటి మందులు లేకుండా శక్తిని, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహయపడతాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఇలాంటి స్టిక్కర్స్ ను సెలబ్రెటీలు చాలా మంది తమ ఆరోగ్యం కోసం ఉపయోగిస్తున్నారు. వీటి ధర దాదాపు వేలల్లో ఉంటుందని సమాచారం.

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

ఇదిలా ఉంటే.. సోషల్ మీడయాలో రకుల్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ జనాలను ఆకట్టుకుంటుంది. ట్రెడిషనల్, మోడ్రన్ లుక్కులో ఈ అమ్మడు గ్లామర్ ఫోజులతో కట్టిపడేస్తుంది. అలాగే తన ఫిట్నెస్ కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తూ వీడియోస్, ఫోటోస్ షేర్ చేస్తుంది. అలాగే ఇప్పుడిప్పుడే తన ఫిట్నెస్, డైట్ ప్లాన్స్ రివీల్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి : Serial Actress: ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. అలా ఆకలి తీర్చుకున్నా.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్..

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..