పవన్​-క్రిష్ మూవీలో హీరోయిన్​గా రకుల్ ?

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క్రిష్‌.. పవన్‌ కల్యాణ్‌తో ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. పీరియాడికల్‌ డ్రామాగా రూపొందుతోన్న‌ ఈ చిత్రంలో ప‌వ‌న్ ప్ర‌త్యేక లుక్ లో క‌నిపించ‌బోతున్నారు.

పవన్​-క్రిష్ మూవీలో హీరోయిన్​గా రకుల్ ?

PSPK 27 : టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క్రిష్‌.. పవన్‌ కల్యాణ్‌తో ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. పీరియాడికల్‌ డ్రామాగా రూపొందుతోన్న‌ ఈ చిత్రంలో ప‌వ‌న్ ప్ర‌త్యేక లుక్ లో క‌నిపించ‌బోతున్నారు. కాగా ప్ర‌స్తుతం ఓటీటీల ట్రెండ్ న‌డుస్తోన్న నేప‌థ్యంలో క్రిష్‌.. వెబ్‌సిరీస్‌లపై కూడా ఫోక‌స్ పెట్టారు. ఇప్పటికే ‘ఆహా’ ఓటీటీ కోసం ‘మస్తీస్’‌ అనే స్టోరీ సిద్దం చేశారు. వెబ్‌సిరీస్‌ల కోసం క్రిష్‌ మరికొన్ని కథలు రెడీ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

ఈ క్ర‌మంలో క్రిష్‌ తన వద్ద ఉన్న కథల్లోని ఓ పాత్రకు హీరోయిన్‌ రకుల్ ప్రీత్ అయితే బాగుంటుంద‌ని భావిస్తున్నార‌ట‌. ఈ మేరకు ఆమెతో‌ సంప్రదింపులు కూడా జరిపారట. కానీ రకుల్‌ తన నిర్ణయాన్ని ఇంకా ఫైన‌ల్ చేయ‌లేద‌ని స‌మాచారం. అయితే ఇక్కడే ఇండ‌స్ట్రీ వర్గాల్లో రెండు వాదనలు వినిపిస్తున్నాయి. రకుల్‌ను పవన్‌తో తెరెక్కిస్తున్న మూవీలో హీరోయిన్‌గా తీసుకుంటున్నారని, లేదు..లేదు… వెబ్‌ సిరీస్‌ల్లో ఒకటి మహిళా ప్రాధాన్యం ఉన్న స్టోరీ ఉందని.. అందులో నటించాలని రకుల్‌ను క్రిష్‌ కోరినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మరి రకుల్‌ నటించేది సినిమాలోనా? వెబ్‌సిరీస్‌లోనా? తెలియాలంటే అఫిషియ‌ల్ అనౌన్సిమెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Will Rakul Romance Pawan Kalyan In Krrish's Film? - Tupaki English ...

 

Read More : పారితోష‌కం పెంచేసిన ‘బుట్ట బొమ్మ‌’ : ఈ ప‌రుగు ఎందాక‌మ్మా