రివ్యూ: ఉమామహేశ్వర ఉగ్రరూపస్య

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Jul 31, 2020 | 3:55 PM

కరోనా వైరస్ వీర‌విహారం చేస్తోన్న నేప‌థ్యంలో ఇప్ప‌ట్లో థియేటర్లు ఓపెన్ చేసే ప‌రిస్థితి కనిపించ‌డం లేదు. దీంతో లాక్ డౌన్ కు ముందే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాల‌న్నీ.. ఓటీటీల బాట ప‌డుతున్నాయి.

రివ్యూ: ఉమామహేశ్వర ఉగ్రరూపస్య

చిత్రం: ఉమామహేశ్వర ఉగ్రరూపస్య నటీనటులు: సత్యదేవ్‌, హరిచందన, నరేశ్‌, సుహాస్‌, రూప, కుశాలిని తదితరులు సంగీతం: బిజిబల్‌ సినిమాటోగ్రఫీ: అప్పు ప్రభాకర్‌ ఎడిటింగ్‌: రవితేజ గిరిజాల నిర్మాత: శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని, విజయప్రవీణ పరుచూరి దర్శకత్వం: వెంకటేశ్‌ విడుదల: 30-07-2020 (నెట్‌ఫ్లిక్స్‌)

ఇంట్రో :

Uma Maheswara Ugra Roopasya movie review: కరోనా వైరస్ వీర‌విహారం చేస్తోన్న నేప‌థ్యంలో ఇప్ప‌ట్లో థియేటర్లు ఓపెన్ చేసే ప‌రిస్థితి కనిపించ‌డం లేదు. దీంతో లాక్ డౌన్ కు ముందే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాల‌న్నీ.. ఓటీటీల బాట ప‌డుతున్నాయి. ఈ కోవ‌లో తాజాగా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ద్వారా 30వ తేదీన రిలీజ‌య్యింది. మలయాళంలో విజ‌య‌వంత‌మైన‌ ‘మహేశ్‌ ఇంటే ప్రతికారం’ చిత్రాన్ని తెలుగులోకి ‘ఉమామహేశ్వర..’గా రీమేక్‌ చేశారు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు విభిన్న‌త ఉండే సినిమాలు అందిస్తోన్న‌ సత్యదేవ్‌ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. ‘కేరాఫ్‌ కంచరపాలెం’తో ఇండ‌స్ట్రీ మొత్తాన్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచిన‌ వెంకటేశ్‌ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బాహుబ‌లి నిర్మాత‌లు, విజయప్రవీణ పరుచూరి సినిమాను నిర్మించారు. మరి ఉమామహేశ్వరరావు ఎవరిపై, ఎందుకు ఉగ్రరూపం దాల్చాడు..అందుకు కార‌ణాలు ఏంటి అన్న విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

క‌థ :

హీరో ఉమామహేశ్వరరావు‌(స‌త్య‌దేవ్‌) అర‌కులోని ఓ ఫొటోగ్రాఫ‌ర్‌. త‌న ప‌ని తాను చేసుకుంటూ జీవ‌నం సాగిస్తుంటాడు. గొడ‌వ‌లంటే మ‌హా భ‌యం. అలాంటిది ఓ రోజు వీధి రౌడీ జోగినాథ్ (ర‌వీంద్ర విజ‌య్‌)తో సంద‌ర్బానుసారం కొట్లాట‌‌కు దిగుతాడు. తిరిగి కొట్ట‌డం చేత‌కాక అంద‌రి ముందు దారుణంగా దెబ్బలు తింటాడు. దీంతో అత‌ని మ‌న‌సు చివుక్కుమంటుంది. ఆ కోపంతో త‌న‌ను కొట్టిన వాడిని మ‌ళ్లీ తిరిగి కొట్టేవ‌ర‌కు చెప్పులు కూడా వేసుకోన‌ని ప్రతిజ్ఞ చేస్తాడు. అలా అప్ప‌టివ‌ర‌కు న‌వ్వుతూ, న‌లుగురిని న‌వ్విస్తూ ఉండే ఉమామ‌హేశ్వ‌ర‌రావు ఉగ్ర రూపం దాలుస్తాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌న్న‌ది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేష‌ణ‌ :

మలయాళ చిత్రాలు చాలా స‌హ‌జంగా ఉంటాయి. అలాంటి చిత్రానికి ‘కేరాఫ్‌ కంచరపాలెం’ వంటి అవార్డు విన్నింగ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్‌ మహాను ఎంచుకోవడంతోనే మూవీ యూనిట్ సగం విజయం సాధించింది. మలయాళ కథను తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్లు మార్పు చేర్పులు చేశారు. ప్రతి పాత్ర సహజ సిద్దంగా ఉంటుంది. అరకు అందాలు సినిమాకు మ‌రింత ప్ల‌స్ అయ్యాయి. ఫొటోగ్రాఫర్‌గా మహేశ్‌ పరిచయ సన్నివేశాలు, స్వాతితో ప్రేమ సన్నివేశాలతో ఫ‌స్టాఫ్ సరదాగా సాగిపోతుంది. ముఖ్యంగా దర్శకుడు వెంక‌టేష్ అరకు, ఆ చుట్టు పక్కల గ్రామాల ప్రజలు జీవన విధానం, ఆహారపు అలవాట్లను కూడా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే క‌థ‌నం కాస్త స్లోగా సాగుతోన్న ఫీలింగ్ వ‌స్తుంది. మ‌ధ్య‌మ‌ధ్య‌లో బోర్ ఫీలింగ్ క‌లుగుతుంది. మహేశ్‌ తన్నులు తినడం, తనని కొట్టినవాడిని తిరిగి తన్నే వరకూ చెప్పులు వేసుకోనని ప్రతిజ్ఞ చేయడంతో చేసిన సంద‌ర్భంలో సినిమాలో ప్రేక్షకుడు తీన‌మ‌వుతాడు.

ఎవ‌రెలా న‌టించారంటే :

సందేహం లేదు.. విలక్షణ నటుడు సత్యదేవ్ తెలుగు చ‌ల‌న చిత్ర పరిశ్ర‌మకు దొరికిన బంగారం. ఎక్క‌డా త‌డ‌బాటు లేదు. హ‌డావిడి లేదు. ఉమామహేశ్వరరావు‌ పాత్ర త‌ప్ప అక్క‌డ సినిమా చూస్తున్నంతసేపు స‌త్య‌దేవ్ క‌నిపించ‌డు. వేసిన‌ పాత్రకు సత్యదేవ్ నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. మంచివాడిగా, గొడవలంటే భయపడే మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ్య‌క్తిగా భ‌లే నటించాడు. ఆ త‌ర్వాత ఉగ్ర‌రూపం దాల్చినప్పుడు అంతే స్థాయిలో చెల‌రేగిపోయాడు. అత‌డిలోని మ‌రిన్ని కోణాల‌ను ఆవిష్క‌రించే పాత్ర‌ల‌ను ర‌చ‌యితలు, ద‌ర్శ‌కులు రాసుకుంటే..పరిశ్ర‌మ‌కు ఎంతో ఉప‌యోగ‌క‌రం. స్వాతి పాత్ర‌లో హీరోయిన్ హ‌రిచంద‌న బాగానే చేసింది. రౌడీ చెల్లెలు జ్యోతి పాత్ర‌లో రూప కాస్త గ్లామ‌ర‌స్‌గా క‌నిపించారు. నరేశ్‌, సుహాస్‌ మినహా మిగిలిన వారందరూ కొత్తవారే.  ఆయా పాత్రల్లో ప‌రిధి మేర‌కు న‌టించారు. బిజిబల్ సంగీతం సినిమాకు మ‌రో ఎస్సెట్. పాటలన్నీ నేపథ్యంలోనే హాయిగా సాగిపోతాయి. అప్పు ప్రభాకర్‌ సినిమాటోగ్రఫీ ర‌మ్యంగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌ కొత్తద‌నంతో నిండి ఉంది. రవితేజ గిరిజాల తన కత్తెరకు ఇంకాస్త ప‌దును పెడితే బాగుండేది.

ప్ల‌స్ పాయింట్స్‌ :

స‌త్య‌దేవ్ న‌ట‌న‌ నేప‌థ్య సంగీతం సినిమాటోగ్ర‌ఫీ అర‌కు అందాలు

మైన‌స్ పాయింట్స్‌:

స్లో నెరేష‌న్‌

Read More :పవన్​-క్రిష్ మూవీలో హీరోయిన్​గా రకుల్ ?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu