Rakul Preet Singh: డ్రగ్స్ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు

హైదరాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారం సినిమా ఇండస్ట్రీలో మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు, నటుడు అమన్ ప్రీత్ సింగ్ పై కూడా ఆరోపణలు రావడం పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది.

Rakul Preet Singh: డ్రగ్స్ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు
Rakul Preet Singh Brother Aman Preet Singh

Updated on: Jan 07, 2026 | 6:09 PM

మాసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ హైకోర్టును ఆశ్రయించాడు. డ్రగ్స్ కేసులో అతడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విక్రేతల నుంచి డ్రగ్స్‌ను కొనుగోలు చేసినట్లు కేసు నమోదైంది. నాటి నుంచి అమన్ పరారీలో ఉన్నాడు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై మంగళవారం (జనవరి 06) హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.గత ఏడాది డిసెంబర్ 19న హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్ పరిధిలో పోలీసులు జరిపిన డ్రగ్స్ దాడుల్లో కొకైన్, ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పట్టుబడిన నిందితులను విచారించగా అమన్ ప్రీత్ సింగ్ పేరు వెలుగుచూసింది. నెల రోజుల వ్యవధిలో అమన్ ఆరుసార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఈగల్, మాసబ్‌ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న నితిన్ సింఘానియా, షర్నిక్ సంఘీలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి నుంచి భారీ గా కొకైన్, ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. వీరిని విచారించగా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు కూడా వెలుగులోకి వచ్చింది. అయితే అప్పటి నుంచే అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.  అయితే ఈ కేసులో పోలీసులు అమన్‌ను రెగ్యూలర్ కస్టమర్ గా  గుర్తించి.. అరెస్ట్  చేయడానికి గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమన్ అరెస్ట్ నుంచి ఎఫ్ఐఆర్ రద్దు కోసం హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి

సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ తో రకుల్ ప్రీత్ సింగ్..

 

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి