Rakshit Shetty:’777 ఛార్లి’తో రానున్న రక్షిత్ శెట్టి.. కన్నడ హీరో కోసం రంగంలోకి రానా..
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా మూవీస్ హవా నడుస్తుంది. అందరు ఇప్పుడు పాన్ ఇండియా కథలనే ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా మూవీస్ హవా నడుస్తుంది. అందరు ఇప్పుడు పాన్ ఇండియా కథలనే ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన పుష్ప(Pushpa), ఆర్ఆర్ఆర్(RRR , కేజీఎఫ్ చాప్టర్ 2 భారీ విజయాలను సొంతం చేసుకొని అన్ని భాషల్లో కలెక్షన్స్ సునామి సృష్టించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడ హీరో రక్షిత్ శెట్టి(Rakshit Shetty) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. అతడే శ్రీమన్నారాయణ చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు రక్షిత్. ఇప్పుడు మరో విభిన్నమైన సినిమా ‘777 ఛార్లి’తో ఆడియెన్స్‌ను అలరించడానికి సిద్ధమవుతున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ లెవల్లో విడుదలవుతుంది.
ఛార్లి అనే కుక్క పిల్ల అనుకోని పరిస్థితుల్లో బయటకు వచ్చి ఇబ్బందలు పడినప్పుడు ధర్మ అనే వ్యక్తిని ఎలా కలుసుకుంది. వారి మధ్య అనుబంధం ఎలా ఏర్పడింది. చివరకు ఏం జరిగిందనే విషయాలను 777 ఛార్లి అనే అడ్వెంచరస్ కామెడీలో చూపించబోతున్నారు. రక్షిత్ శెట్టి ఇందులో ప్రధాన పాత్రధారిగా నటిస్తూ జి.ఎస్.గుప్తాతో కలిసి తన పరమ్ వహ్ బ్యానర్‌పై సినిమాను నిర్మించారు. సంగీత శ్రింగేరి, రాజ్ బి.షెట్టి, డానిష్ సెయిట్, బాబీ సింహ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. కిరణ్ రాజ్.కె దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమానకు రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరిస్తూ.. ఛార్లి 777 చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అలాగే మలయాళంలో నటుడు, నిర్మాత పృథ్వీ రాజ్ సుకుమారన్, తమిళంలో కార్తీక్ సుబ్బరాజ్ చిత్ర సమర్పకులుగా వ్యవహరించనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :