AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

777 Charlie: చార్లీ తల్లయ్యింది.. ఆరు బుజ్జి పిల్లలకు జన్మనిచ్చిన స్టార్ డాగ్

'777 చార్లీ' సినిమాతో రక్షిత్ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు రక్షిత్ శెట్టి. '777 చార్లీ' చిత్రం జూన్ 10, 2022న విడుదలైంది. కన్నడలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ సినిమా విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాలో ఒక కుక్క కీలక పాత్రలో కనిపించింది. సినిమా మొత్తం ఆ కుక్కకు , హీరోకు మద్యే జరుగుతుంది.

777 Charlie: చార్లీ తల్లయ్యింది.. ఆరు బుజ్జి పిల్లలకు జన్మనిచ్చిన స్టార్ డాగ్
777 Charlie
Rajeev Rayala
|

Updated on: May 16, 2024 | 1:05 PM

Share

నటుడు రక్షిత్ శెట్టి కన్నడ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు రక్షిత్ శెట్టి. ఇటీవలే సప్తసముద్రాల దాటి సినిమాతో హిట్ అందుకున్నాడు రక్షిత్. ఇదిలా ఉంటే తాజాగా ఆయన  ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ గుడ్ న్యూస్ ను అభిమానులతో పంచుకున్నాడు. చార్లీ కుక్కకు సంబందించిన ఓ సంతోషకరమైన వార్తను షేర్ చేసుకున్నాడు రక్షిత్ శెట్టి. ‘777 చార్లీ’ సినిమాతో రక్షిత్ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు రక్షిత్ శెట్టి. ‘777 చార్లీ’ చిత్రం జూన్ 10, 2022న విడుదలైంది. కన్నడలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ సినిమా విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాలో ఒక కుక్క కీలక పాత్రలో కనిపించింది. సినిమా మొత్తం ఆ కుక్కకు , హీరోకు మద్యే జరుగుతుంది.

సినిమా విజయంలో చార్లీ కీలక పాత్ర పోషించింది. చార్లీ నటనకు ప్రేక్షకులు, జంతు ప్రేమికులు మెచ్చుకున్నారు. సినిమా క్లైమాక్స్‌లో చార్లీ పిల్లలకు జన్మనిస్తుంది. అయితే నిజ జీవితంలో కూడా చార్లీకి తల్లి అయ్యింది.  సినిమాలో నటించిన చార్లీ ఇప్పుడు తల్లి అయ్యింది. 6 పిల్లలకు జన్మనిచ్చింది. రక్షిత్ శెట్టి , చార్లీ  డాగ్ దాని పిల్లలను చూడటానికి మైసూర్ వెళ్లాడు. దీని గురించి సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు.

ప్రత్యక్షంగా రావడానికి కారణం ఉంది. 777 చార్లీ సినిమా విడుదలై దాదాపు 2 సంవత్సరాలు కావస్తోంది. సినిమా విడుదలయ్యాక కూడా మా మదిలో ఒక ఆలోచన మెదిలింది. చార్లీ తల్లి అవ్వాలి. అది పిల్లలకు జన్మనివ్వాలి అని భావించాను. చార్లీ తల్లి కానుందని ఎదురు చూస్తున్నాను. దాని గురించి ఆరా తీస్తూనే ఉన్నాను. ఇప్పుడు అది ఆరు పిల్లలకు జన్మనించింది చాలా సంతోషంగా ఉంది’ అని రక్షిత్ శెట్టి అన్నారు. ప్రమోద్‌తో చార్లీ ఉంటుంది. నేను అతనికి ఫోన్ చేసినప్పుడల్లా, చార్లీ తల్లి అయ్యే విషయం గురించే అడుగుతాను. చార్లీ వయసు పెరగడంతో తల్లి కావడం కష్టమవుతుందేమో అనేవారు. ఆశ్చర్యకరంగా మే 9న చార్లీ 6 పిల్లలకు జన్మనిచ్చింది. అందుకే చార్లీని, దాని పిల్లలను చూసేందుకు మైసూర్ వచ్చాను’’ అని రక్షిత్ శెట్టి తెలిపారు. రక్షిత్ శెట్టి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో చార్లీ , దాని పిల్లలను తన అభిమానులకు చూపించాడు.

రక్షిత్ శెట్టి ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు