Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప2 పై విషం కక్కిన హృతిక్ తండ్రి.. అభిమానుల ఆగ్రహం

|

Jan 16, 2025 | 12:08 PM

అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం పుష్ప ది రూల్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. గతేడాది డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది.

Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప2 పై విషం కక్కిన హృతిక్ తండ్రి.. అభిమానుల ఆగ్రహం
Pushpa 2 Movie
Follow us on

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. గతేడాది డిసెంబర్ 05న ఈ సినిమా ఇప్పటికే రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు కలెక్ట్ చేసింది. తద్వారా బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు పుష్ప 2 సినిమా ముందున్నది కేవలం ఆమిర్ ఖాన్ దంగల్ మాత్రమే. రేపో మాపో బాలీవుడ్‌కి తనకంటూ మిగిలిన ఏకైక ఈ మూవీ రికార్డ్‌ను కూడా మట్టికరిపించే దిశగా పుష్ప 2 మూవీ దూసుకుపోతోంది. దంగల్ సినిమా ఓవరాల్ గా రూ.2000 కోట్లు రాబట్టింది. ఇప్పుడు పుష్ప 2 మూవీ ఈ రికార్డును అధిగమించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత, హీరో హృతిక్ రోషన్ తండ్రి రాకేష్‌ రోషన్‌ పుష్ప2 సహా దక్షిణ భారత సినిమాలపై విషం కక్కారు. మూస కథలతో సినిమాలు చేస్తున్నారంటూ ఓర్వలేని తనంతో మాట్లాడారు. ‘పుష్ప 2తో సహా దక్షిణాది సినిమాలన్నీ చాలా గ్రౌన్దేడ్‌ (మూలాలకు కట్టుబడి) ఉన్నాయి. ఎప్పటిలాగే తమ పాతదైన పంథాలో వెళుతున్నాయి. పాటలు, యాక్షన్‌ సీక్వెన్సులు, డైలాగులు, భావోద్వేగాలు… ఇలా ఏళ్లనాటి ఫార్ములా తోనే సినిమాలు చేస్తున్నాయి. అవి ఏ దశలోనూ అప్డేట్ అవ్వడం లేదు. మూస పద్ధతిలోనే సినిమాలు చేస్తూ విజయాలు సాధిస్తున్నారు’

‘మరోవైపు బాలీవుడ్ ప్రయాణం భిన్నంగా సాగుతోంది. నేను మొదట్లో కహోనా ప్యార్ హై సినిమాను తీశాను. ఆ తర్వాత రొమాంటిక్ లవ్ సినిమాలు తీయాలనుకోలేదు. భిన్నంగా కోయి మిల్ గయా మూవీని తెరకెక్కించాను. మేం సవాళ్లను ఎదుర్కొని కొత్త పంథాలోనే సినిమాలు తీస్తున్నాం’ అని రాకేష్ రోషన్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

 

రేపటి నుంచే థియేటర్లలో పుష్ప రీ లోడెడ్ వెర్షన్..

కాగా శుక్రవారం (జనవరి 17) నుంచి పుష్ప రీలోడెడ్ వెర్షన్ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పుడున్న నిడివికి అదనంగా మరో 20 నిమిషాల సీన్లను జోడించి రిలీజ్ చేస్తున్నారు. దీంతో పుష్ప 2 వసూళ్లు మరింత పెరగవచ్చని చిత్ర బృందం భావిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.