
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ హఠాన్మరణం అందరినీ కలిచివేసింది. తన డ్యాన్సింగ్ ట్యాలెంట్‌తో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారాయన. వేలాది సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. అంతేకాదు తన డ్యాన్సింగ్ స్కిల్స్‌తో ఎంతో మంది డ్యాన్స్ మాస్టర్లను తయారుచేశారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లుగా వెలుగొందుతోన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ దగ్గర శిక్షణ తీసుకున్నవారే. అయితే కొన్ని కారణాలతో డ్యాన్స్ మాస్టర్ సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆ తర్వాత ఫ్యామిలీకి కూడా దూరంగా ఉండిపోయారు. కాగా ఇటీవల రాకేష్ మాస్టర్ మూడో భార్య లక్ష్మీపై కొందరు మహిళలు, యూట్యూబర్లు దాడి చేశారు. గతంలో తన వద్ద వంట మనిషిగా చేరిన ఆమెను తన మూడో భార్యగా ప్రకటించారు రాకేష్ మాస్టర్. అయితే ఏమైందో తెలియదు కానీ కొందరు యూట్యూబర్లు, మహిళలు లక్ష్మీపై దాడి చేసి చితక బాదారు. ఈ విషయం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
కాగా ఈ దాడి జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది లక్ష్మి. మరోవైపు యూట్యూబర్ కూడా లక్ష్మీపై కంప్లైంట్ చేసింది. ఇరువురి నుంచి ఫిర్యాదులు అందుకున్న పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. తాజాగా ఈ దాడి ఘటనపై స్పందించింది లక్ష్మి. తనను చంపేందుకు రెండు నెలల నుంచి ప్రణాళికలు రచిస్తున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. అందులో భాగంగానే తనపై పట్టపగలు దాడి జరిగిందని పేర్కొంది. ‘నెల్లూరుకు చెందిన భారతి అనే మహిళ లక్ష రూపాయల సుపారీ ఇచ్చి నాపై దాడి చేయించింది. యూట్యూబ్ నిర్వహించొద్దంటూ
నన్ను బెదిరిస్తున్నారు. యూట్యూబ్ విడిచి వెళ్లాలంటూ హెచ్చరిస్తున్నారు. నాపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి’ అని కోరింది లక్ష్మి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.