AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakesh master: రాకేష్ మాస్టర్ మహేష్ బాబుకు కూడా కొరియోగ్రఫీ చేశారు.. ఏ సినిమా కంటే

మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌ వల్ల ఆయన చనిపోయినట్లు గాంధీ వైద్యులు ప్రకటించారు. రాకేష్‌ మాస్టర్‌ మరణం తర్వాత ఆయన కుటుంబంలో విషాదం అలుముకుంది. కడసారి చూసేందుకు అభిమానులు, శిష్యులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి తరలివచ్చారు.

Rakesh master: రాకేష్ మాస్టర్ మహేష్ బాబుకు కూడా కొరియోగ్రఫీ చేశారు.. ఏ సినిమా కంటే
Mahesah Babu , Rakesh Masta
Rajeev Rayala
|

Updated on: Jun 19, 2023 | 8:51 AM

Share

ప్రముఖ కొరియోగ్రాఫర్‌, యూట్యూబ్‌ స్టార్‌.. సోషల్‌ మీడియా సెన్సేషన్‌.. రాకేష్‌ మాస్టర్‌ ఆకస్మిక మరణం షాక్‌కి గురిచేసింది. మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌ వల్ల ఆయన చనిపోయినట్లు గాంధీ వైద్యులు ప్రకటించారు. రాకేష్‌ మాస్టర్‌ మరణం తర్వాత ఆయన కుటుంబంలో విషాదం అలుముకుంది. కడసారి చూసేందుకు అభిమానులు, శిష్యులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి తరలివచ్చారు.

మాట కటువు, మనిషి వెన్న.  నిన్న మొన్న కూడా ఆయన యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ చాలా ఎనర్జిటిక్‌గా కనిపించారు. తనదైన శైలిలో.. తనకు క్లోజ్‌గా ఉండే వారితో సరదాగా గడిపారు. ఓ సినిమా షూటింగ్‌ కోసం వైజాగ్‌ వెళ్లి వచ్చారు రాకేష్‌ మాస్టర్‌. విపరీతమైన ఎండ వల్ల వడదెబ్బ తగిలి డయేరియా వల్ల అనారోగ్యం బారిన పడినట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు రాకేష్‌ మాస్టర్‌. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, షుగర్ లెవెల్స్ పూర్తిగా పడిపోవడంతో మృతి చెందారని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు.

1500 సినిమాలు, 2వేలకు పైగా పాటలకు కొరియోగ్రఫీ. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ స్ధానం సంపాదించుకున్న రాకేష్‌ మాస్టర్‌ ఇకలేరు. ఆయన చనిపోయారన్న వార్త అందర్నీ షాక్‌కి గురిచేసింది. రాకేష్ మాస్టర్ టాలీవుడ్ లో చాలా మంది హీరోలకు కొరియోగ్రఫీ చేశారు. ప్రభాస్, రవితేజ, హరికృష్ణ, జగపతి బాబు లాంటి హీరోలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూడా కొరియోగ్రఫీ చేశారు రాకేష్ మాస్టర్. మహేష్ బాబు నటించిన యువరాజు సినిమాలో గుంతలకిడి భామ అనే సాంగ్ లో మహేష్ కృష్ణుడి గెటప్ లో కనిపించారు. ఆ పార్ట్ కు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారట. అలాగే అదే పాటలో మరికొంత భాగం ఆయన కొరియోగ్రఫీ చేశారట. రాకేష్ మాస్టర్ మరణం ఇప్పుడు టాలీవుడ్ లో విషాదాన్ని నింపింది.Mahesh Babu

Mahesh Babu