AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth : రూమార్లేమీ నమ్మొద్దు అంటోంది అన్నాత్తే టీమ్… సినిమా రిలీజ్ ఎప్పుడంటే

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ ప్రధానపాత్రలో ‘సిరుతై’ శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘అన్నాత్తే’. ఖుష్బూ, మీనా, నయనతార హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో కీర్తి సురేష్

Rajinikanth : రూమార్లేమీ నమ్మొద్దు అంటోంది అన్నాత్తే టీమ్... సినిమా రిలీజ్ ఎప్పుడంటే
Superstar Rajinikanth
Rajeev Rayala
| Edited By: |

Updated on: Apr 23, 2021 | 8:08 AM

Share

Rajinikanth Annaathe : సూపర్‌స్టార్ రజనీకాంత్‌ ప్రధానపాత్రలో ‘సిరుతై’ శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘అన్నాత్తే’. ఖుష్బూ, మీనా, నయనతార హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, సూరి, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టు… డైలాగ్ డెలివరీలోనే కాదు పర్సనల్ మేనరిజంలో కూడా ఇదే సూపర్ స్టార్ రజనీ స్టయిల్. కాకపోతే.. రీసెంట్ గా కొన్నిసార్లు యూటర్న్ తీసుకున్నారు.. అది వేరే విషయం. ఇక మీదట మాత్రం మన దారి రహదారి అంటున్నారట నరసింహ. చెప్పొచ్చేదేంటంటే… అన్నాత్తే షూటింగ్ విషయంలో తగ్గేదే లే అనేది రజనీ క్యాంప్ చెబుతున్న మాట. గత డిసెంబర్లో నలుగురికి కరోనా సోకడంతో.. సడన్ గా ప్యాకప్ చెప్పి చెన్నై వెళ్లిపోయింది అన్నాత్తే టీమ్. అనారోగ్యం భయపెట్టడంతో తన పొలిటికల్ ఎంట్రీని కూడా రద్దు చేసుకుని ఇంటికే పరిమితమయ్యారు సూపర్ స్టార్ రజనీ. ఇదే గ్యాప్ లో అన్నాత్తే మూవీ మీద పెద్ద డౌట్లే వచ్చేశాయ్. అసలీ సినిమా వస్తుందా రాదా అనే సందేహాన్ని క్లియర్ చేస్తూ.. రీసెంట్ గా మళ్ళీ షూట్స్ లో జాయిన్ అయ్యారు రజనీ. హైదరాబాద్ ఫిలిం సిటీలో అన్నాత్తే ఫైనల్ షెడ్యూల్ జరుగుతోంది. మరో 15 రోజుల పాటు కంటిన్యూ అవుతుందని.. టోటల్ టీమ్ ని తమ దగ్గరే పెట్టుకుని.. కేర్ ఫుల్ గా షూట్ చేస్తున్నామని  క్లారిటీ ఇచ్చారు మేకర్స్. తెలంగాణ గవర్నమెంట్ ఇంపోజ్ చేసిన లాక్ డౌన్ తో అన్నాత్తేకి  ఎటువంటి బ్రేక్సూ పడవట. సో.. గుమ్మడికాయ కొట్టాకే చెన్నై వెళతాం.. రూమార్లేమీ నమ్మొద్దు అంటోంది అన్నాత్తే టీమ్. ఈసారి దీపావళికి రావడం పక్కా అని నవంబర్ 4ని రిలీజ్ డేట్ గా కన్ఫామ్ చేసింది సన్ పిక్చర్స్ సంస్థ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sarrainodu Movie: అల్లు అర్జున్‌ ‘సరైనోడు’కు ఐదేళ్లు.. రికార్డులను క్రియేట్ చేసి సంచలనం సృష్టించిన మూవీ

Follow Us