Rajinikanth: ‘జైలర్’ ఎఫెక్ట్.. రజినీకి మాత్రమే ఆ రికార్డ్ సాధ్యం.. ఒక్క సినిమాకు రూ.210 కోట్ల రెమ్యునరేషన్..

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 650 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. ఇక ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 328 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక జైలర్ హవా చూస్తుంటే మరి కొన్ని రోజులు థియేటరలలో ఇదే హైప్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత రజనీ తన కెరీర్‌లో మరో భారీ విజయాన్ని అందుకున్నారు. అంతేకాదు.. ఇప్పుడు సౌత్ ఇండియా స్టూపర్ స్టార్ రికార్డ్ సృష్టించారు.

Rajinikanth: జైలర్ ఎఫెక్ట్.. రజినీకి మాత్రమే ఆ రికార్డ్ సాధ్యం.. ఒక్క సినిమాకు రూ.210 కోట్ల రెమ్యునరేషన్..
Rajini Kanth

Updated on: Sep 01, 2023 | 5:13 PM

దాదాపు రెండు సంవత్సరాల తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ బిగ్ స్క్రీన్ పై కనిపించారు. ఆయన నటించిన లేటేస్ట్ చిత్రం జైలర్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీకి అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆగస్ట్ 10న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు థియేటర్లలో భారీ కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 650 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. ఇక ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 328 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక జైలర్ హవా చూస్తుంటే మరి కొన్ని రోజులు థియేటరలలో ఇదే హైప్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత రజనీ తన కెరీర్‌లో మరో భారీ విజయాన్ని అందుకున్నారు. అంతేకాదు.. ఇప్పుడు సౌత్ ఇండియా స్టూపర్ స్టార్ రికార్డ్ సృష్టించారు. ఈ సినిమా ద్వారా ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా రజనీకాంత్ నిలిచారు. కేవలం రజినీకి మాత్రమే ఈ రికార్డ్ సాధ్యమయ్యింది.

తమిళంతోపాటు కన్నడ, మలయాళం, తెలుగు, హిందీ ఇలా అన్ని చోట్ల జైలర్ మంచి వసూళ్లు రాబట్టింది. అటు విదేశాల్లోనూ ప్రేక్షకుల నుంచి మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈసినిమా కోసం రజనీకాంత్ రూ.110 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారు. ఇక సినిమా విడుదలయ్యే నాటికే రజినీకి రెమ్యూనరేషన్ డబ్బులు అందించింది నిర్మాణ సంస్థ. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ కు డబుల్ సర్ ప్రైజ్ ఇచ్చారు నిర్మాత కళానిధి మారన్. జైలర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబడుతున్నందుకు ఈ చిత్ర నిర్మాత సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ సంతోషానికి అవధులు లేవు. దీంతో ఆయన రజినీకి మరోసారి రూ.100 కోట్ల చెక్ ఇవ్వడమే కాకుండా మరో స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఆగస్ట్ 31 నిర్మాత కళానిధి మారన్ రజినీని కలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమా లాభాల్లో కొంత భాగాన్ని రజినీకి అందించారు. రజినీకి చెక్ ఇస్తున్న ఫోటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది సన్ పిక్చర్స్. అయితే చెక్కు కవర్ పై ది రియల్ రికార్డ్ మేకర్ అని రాసి ఉండడం గమనార్హం. చెక్ తోపాటు ఆయనకు బీఎండబ్ల్యూ కార్ గిఫ్ట్ ఇచ్చారు కళానిధి మారన్. రెండు బీఎండబ్ల్యూ కార్లను ఆయన వద్దకు తీసుకెళ్లి నచ్చింది సెలక్ట్ చేసుకోవాలని కోరారు. దీంతో రజినీ బీఎండబ్ల్యూ ఎక్స్ 7 మోడల్ కారును ఎంచుకున్నారు. దీని ధర సుమారు రూ.2.25 కోట్లు అని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాకు రూ.110 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఇక ఇప్పుడు మరోసారి రూ.100 చెక్ ఇచ్చారు నిర్మాత కళానిధి. ఇక ఇప్పటివరకు జైలర్ సినిమా కోసం రజినీ రూ.210 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇప్పటివరకు ఇంత పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకున్న తొలి హీరో రజినీ కావడం విశేషం. ఆగస్ట్ 10న విడుదలైన జైలర్ చిత్రంలో రజనీతో పాటు శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, తమన్నా, రమ్యకృష్ణ నటించారు. గురువారం (ఆగస్టు 31) ఈ చిత్రం రూ.2.4 కోట్లు రాబట్టింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.