Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jawan: ‘జవాన్‌’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్.. అక్కడ ఒక్కో టికెట్ ధర రూ.2400

అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నయనతార హీరోయిన్‌గా నటించింది. విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్‌ 7న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఈ రోజు స్టార్టయ్యాయి. దీంతో టికెట్ల కోసం ఫ్యాన్స్ అల్లాడిపోతున్నారు. అయితే టికెట్ల రేట్లు చాలా ఎక్కవగా ఉండటం పట్ల కొందరు మూవీ లవర్స్ ఫైరవుతున్నారు.

Jawan: 'జవాన్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్.. అక్కడ ఒక్కో టికెట్ ధర రూ.2400
Shah Rukh Khan
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 01, 2023 | 3:31 PM

బాలీవుడ్ బాద్ షా..  షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్. ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల రిలీజైన ట్రైలర్ ఇంకాస్త బజ్ పెంచింది. ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. షారుఖ్ ఈ చిత్రంలో చాలా గెటప్స్‌లో కనిపించాయి . సినిమా విడుదలకు వారం రోజుల సమయం ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. అయితే టికెట్ ధరలు మాత్రం షాక్ కొట్టేలా ఉన్నాయి. బెంగళూరులో ‘జవాన్’ సినిమా టిక్కెట్లను రూ.2400కి విక్రయిస్తున్నారు.  షారుఖ్ ఖాన్ ఇటీవల మాస్ జోన్‌లో కనిపిస్తున్నాడు. ‘పఠాన్’ సినిమాలో సాలిడ్ యాక్షన్ చేశాడు. ‘జవాన్’ సినిమాలోనూ అది కొనసాగుతుందనడానికి ప్రివ్యూ వీడియో, ట్రైలర్లే నిదర్శనం. ఒక రకంగా చెప్పాలంటే సౌత్ ఇండియా, బాలీవుడ్ కలయికలో రూపొందిన సినిమా ఇది. ఈ చిత్రంలో షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ ‘జవాన్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. నయనతార ఈ మూవీలో హీరోయిన్. తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్లు సన్యా మల్హోత్రా, దీపికా పదుకొణె కూడా కీ రోల్స్‌లో కనిపించనున్నారు. ఇన్ని కారణాల వల్ల యావత్ ఇండియాలో సినిమాపై క్యూరియాసిటీ నెలకొంది.

బెంగళూరులోని డైరెక్టర్స్ కట్ థియేటర్‌లో ‘జవాన్’ టిక్కెట్ ధర రూ. 2400. ఇది లగ్జరీ మల్టీప్లెక్స్ కాబట్టి, టిక్కెట్ ధర కూడా ఆ రేంజ్‌లోనే ఉంది. అలాగే సాధారణ మల్టీప్లెక్స్ లలో కూడా టిక్కెట్ ధర ఎక్కువగానే ఉంటుంది. లులు మాల్‌లోని సినీపోలీస్‌లో నైట్ షోల టిక్కెట్ ధర రూ.1600గా ఉంది. బిన్నిపేట్ సినీపోలీస్‌లో గరిష్ట ధర రూ.750 గా ఉంది. జవాన్’ సినిమా టిక్కెట్ ధర చాలా మల్టీప్లెక్స్‌లలో 250 రూపాయల నుంచి స్టార్టవుతుంది. సింగిల్ స్క్రీన్‌లలో ధర గురించి సమాచారం ఇంకా రాలేదు. టిక్కెట్టు ధర ఇంత ఎక్కువ అయితే సామాన్యులు సినిమా ఎలా చూస్తారనే ప్రశ్న తలెత్తింది. దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు ఫిల్మ్ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు.

ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ అవ్వనుంది. ఈ మూవీకి అనురుధ్ రవిచంద్రన్‌ మ్యూజిక్ అందించాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు జవాన్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సినిమా ప్రిరిలీజ్ బిజినెస్ సైతం జోరుగా జరుగుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..