AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kushi Movie Review: ఖుషి ఎలా ఉంది..? సమంత-విజయ్‌లకు హిట్ దొరికిందా..?

యాక్టర్స్ విషయానికొస్తే విజయ్, సమంతల నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పూర్తిగా ఈ మూవీ విజయ్-సమంతల షోగా చెప్పొచ్చు. వీరిద్దరి స్క్రీన్ ప్రజెన్సీ, లవ్ ట్రాక్, రొమాన్స్ అదిరిపోయింది. ఆరాధ్య పాత్రలో అటు బేగంగా, బ్రహ్మణ యువతిగా సమంత తనదైన శైలిలో మెప్పిస్తుంది. విప్లవ్ గా విజయ్ తన నటన, మాటలతో ఆకట్టుకుంటాడు. అయితే వీరిద్దరి మధ్య అక్కడక్కడ ఆశించిన స్థాయిలో సంఘర్షణ లేకపోవడం రైటింగ్ లోపాలున్నట్లు కనిపిస్తుంది. నాస్తికుడిగా సచిన్ ఖైడ్కర్, ఆస్తికుడిగా మురళీశర్మ పోటాపడి నటించారు.

Kushi Movie Review: ఖుషి ఎలా ఉంది..? సమంత-విజయ్‌లకు హిట్ దొరికిందా..?
Samantha Ruth Prabhu - Vijay Deverakonda
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Sep 01, 2023 | 2:19 PM

Share

సమంత, విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం కాస్తా లైటైనా లేటెస్ట్ గా విడుదలైంది. సినిమా రిలీజ్ కు ముందే ఈ మూవీ సాంగ్స్ ఆడియెన్స్ లో చాలా క్యూరియాసిటీని పెంచాయి. సినిమా హిట్ కాబోతుందనే సంకేతాలు ఇచ్చాయి. మరీ ఖుషి ఎలా ఉంది, సమంత-విజయ్ లకు హిట్ దొరికిందా లేదా రివ్యూలో తెలుసుకుందాం.

ఖుషి కథలోకి వెళ్తే….విప్లవ్ దేవరకొండ(విజయ్ దేవరకొండ) నాస్తికుడైన లెనిన్ సత్యం(సచిన్ ఖైడ్కర్) కొడుకు. BSNLలో ఉద్యోగ రీత్యా కాశ్మీర్ లో పనిచేస్తుంటాడు. కాకినాడలో ప్రముఖ ప్రవచనకర్త చదరంగం శ్రీనివాసరావు(మురళీశర్మ) గారి అమ్మాయి ఆరాధ్య(సమంత). సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ ప్రాజెక్టుపై పనిపై కాశ్మీర్ వెళ్తుంది. అక్కడ ముస్లిం గెటప్ లో ఉన్న ఆరాధ్యను చూసి ఇష్టపడతాడు విప్లవ్. కట్ చేస్తే ఆరాధ్య బేగం కాదు బ్రహ్మిణ్ అని, పైగా తన తండ్రి లెనిన్ సత్యంకు సవాల్ గా నిలిచే చదరంగం శ్రీనివాసరావు అమ్మాయని తెలుసుకుంటాడు. ఆరాధ్య కూడా విప్లవ్…. లెనిన్ సత్యంగారి అబ్బాయి అని తెలుసుకుంటుంది. అయినా…. పరస్పరం ఇద్దరు తమ ప్రేమను ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ చదరంగం శ్రీనివాసరావు వారి పెళ్లికి అడ్డుపడతారు. జాతక దోషాలున్నాయని, పెళ్లి చేసుకుంటే గొడవలు పడతారని, పిల్లలు పుట్టరని, హోమం చేయాలని భయపడెతాడు. వాటన్నింటిని పక్కన పెట్టి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న విప్లవ్- ఆరాధ్యలు… ఈ ప్రపంచంలో బెస్ట్ కపుల్ గా ఉండాలని, తమ తండ్రుల మాటలను అబద్దం చేయాలనుకుంటారు. మరీ విప్లవ-ఆరాధ్యలు ఎలా జీవించారు? వారి కాపురంలో కలతలు వచ్చాయా? చదరంగం శ్రీనివాసరావు, లెనిన్ సత్యం ఎవరిపై ఎవరు గెలిచారనేది ఖుషి కథ.

ఖుషి… ఓ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. ప్రేమ, పెళ్లి నేపథ్యంగా సాగే కథ ఇది. పేద, ధనిక, పరువు, ప్రతిష్టలు, కుల, మతాల మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంగా ఇది వరకు చాలా సినిమాలొచ్చాయి. ఇంచుమించు ఇది కూడా అలాంటి సినిమానే. కానీ ఇందులో ఆస్తికులు, నాస్తికులైన రెండు కుటుంబాల మధ్య ఓ జంట పడే తపనను, వారి మధ్య సంఘర్షణ సృష్టించి కథను నడిపించాడు దర్శకుడు శివ. ఫస్టాప్ ప్రేమకథతో సాగితే సెకండాఫ్ పెళ్లాయక వారి జీవితాల చుట్టూ నడుస్తుంది. కశ్మీర్ లో వచ్చే సన్నివేశాలు, అక్కడి అందాలు కనువిందు చేస్తాయి. విప్లవ్-ఆరాధ్యల లవ్ ట్రాక్ ఆకట్టుకుంటుంది. తప్పిపోయిన పిల్లాన్ని వెతికే క్రమంలో వెన్నెల కిషోర్- విజయ్ దేవరకొండ మధ్య వచ్చే సన్నివేశాలు కామెడీ పండిస్తాయి. ఆరా బేగం కాదు బ్రహ్మాణ్ అని తెలియడం, ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. మురళీశర్మ, సచిన్ ఖేద్కర్ మధ్య సంభాషణలు ఆలోచింపజేస్తాయి.

యాక్టర్స్ విషయానికొస్తే విజయ్, సమంతల నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పూర్తిగా ఈ మూవీ విజయ్-సమంతల షోగా చెప్పొచ్చు. వీరిద్దరి స్క్రీన్ ప్రజెన్సీ, లవ్ ట్రాక్, రొమాన్స్ అదిరిపోయింది. ఆరాధ్య పాత్రలో అటు బేగంగా, బ్రహ్మణ యువతిగా సమంత తనదైన శైలిలో మెప్పిస్తుంది. విప్లవ్ గా విజయ్ తన నటన, మాటలతో ఆకట్టుకుంటాడు. అయితే వీరిద్దరి మధ్య అక్కడక్కడ ఆశించిన స్థాయిలో సంఘర్షణ లేకపోవడం రైటింగ్ లోపాలున్నట్లు కనిపిస్తుంది. నాస్తికుడిగా సచిన్ ఖైడ్కర్, ఆస్తికుడిగా మురళీశర్మ పోటాపడి నటించారు. ఆరాధ్య బామ్మ పాత్రలో సీనియర్ నటి లక్ష్మి కనిపిస్తారు. బీఎస్ఎన్ఎల్ అధికారిణిగా నటి రోహిణి, జయరాం, శరణ్య, వెన్నెల కిషోర్ తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. అలీ, బ్రహ్మానందం అతిథి పాత్రల్లో మెరిసారు.

హేషమ్ అందించిన పాటలు, సంగీతం ఖుషికి ప్రధాన బలాన్ని చేకూర్చాయి. వాటికి తోడు మురళీ తన కెమెరాతో కశ్మీర్ అందాలను, విజయ్-సమంతల మధ్యల కెమెస్ట్రిని ఆకట్టుకునేలా చూపించారు. దర్శకుడు శివ నిర్వాణ తాను నమ్మిన కథను స్పష్టం చెప్పే ప్రయత్నం చేశాడు. పాటలపై దృష్టి పెట్టిన శివ… కథ, స్క్రీన్ ప్లే, రచనపై మరింత దృష్టి పెట్టాల్సింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఖుషి మూవీ…. హ్యాపీగా కుటుంబంతో కలిసి చూడొచ్చు. నేటి తరం యువతీ యువకులు బాగా కనెక్ట్ అవుతుంది. కులాలు, మతాలు, దేవుడు ఉన్నాడు లేడు ఈ విషయాలకంటే…. మనిషి ప్రేమ గొప్పది, మనిషిలోని మానవత్వం గొప్పదనే విషయాన్ని ఖుషిలో చూడొచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..