Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajini Kanth: మీనా కూతురి మాటలకు రజినీకాంత్ కంటతడి.. తల్లి గురించి అసత్య వార్తలపై స్పందించిన నైనిక..

బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మీనా.. నటిగా 40 సంవత్సరాలు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా ఇటీవల చెన్నైలో మీనాకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు తమిళ చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సినీ నటీనటులు విచ్చేశారు.

Rajini Kanth: మీనా కూతురి మాటలకు రజినీకాంత్ కంటతడి.. తల్లి గురించి అసత్య వార్తలపై స్పందించిన నైనిక..
Meena
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 22, 2023 | 6:57 AM

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లలో మీనా ఒకరు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, మోహన్ బాబు వంటి అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన మీనా.. ప్రస్తుతం సహాయ నటిగా రాణిస్తుంది. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మీనా.. నటిగా 40 సంవత్సరాలు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా ఇటీవల చెన్నైలో మీనాకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు తమిళ చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సినీ నటీనటులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ వేడుకలో తన తల్లి గురించి మీనా కూతురు నైనిక మాటలకు రజినీకాంత్ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి మరణం తర్వాత అమ్మ మానసిక ఒత్తిడికి గురైందని.. అదొక పెయిన్ ఫుల్ టైమ్ అంటూ నైనిక మాట్లాడగా.. అక్కడే ఉన్న రజినీతోపాటు.. ఇతర సినీ తారలు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.

మీనా కూతురు నైనిక మాట్లాడుతూ.. “అమ్మా.. నువ్వు ఎంతో శ్రమించి ఈ స్థాయికి వచ్చినందుకు నేను గర్విస్తున్నాను. ఒక నటిగా నువ్వు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటావు. వర్క్ పరంగా నటివే అయినా ఇంటికి వచ్చాక అలా ఉండవు. ఒక అమ్మగా నన్ను ప్రతిక్షణం జాగ్రత్తగా చూసుకుంటావు. నా చిన్నప్పుడు మనమంతా ఓ మాల్ కు వెళ్లాం. మీతో చెప్పకుండా నేను వేరే షాపుకు వెళ్లి చాక్లెట్స్ తింటూ కూర్చున్నాను. చాలా సేపటి తర్వాత నువ్వు వచ్చి నాపై కోపడ్డావు. ఆరోజు నువ్వు ఎంతో కంగారుపడ్డావో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. అప్పుడు నిన్ను కంగారు పెట్టినందుకు సారీ. నాన్న మరణంతో పరిస్థితులు చీకటిగా మారాయి. నువ్వు మానసిక కుంగుబాటుకు లోనయ్యావు. ఇకపై నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను. అన్ని విషయాల్లో సాయం చేస్తాను. ” అంటూ మాట్లాడుతుండగా.. అక్కడే ఉన్న రజినీతోపాటు.. ఇతర సెలబ్రెటీలు కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

“ఇటీవల కొద్దిరోజులుగా మా అమ్మ గురించి కొన్ని ఫేక్ వార్తలు వచ్చాయి. అమ్మ కేవలం నటి మాత్రమే కాదు.. ఆమె కూడా మీలాగా ఓ మనిషే.. ఆమెకూ ఫీలింగ్స్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వార్తలు రాయొద్దు. కనీసం నా గురించి అయినా ఇలాంటి అసత్య వార్తలు ఆపండి” అని చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.