RRR: భారత సినిమా అద్భుతాలకు ఇది ఆరంభం.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్‌ నామినేషన్స్‌ దక్కడంపై సినీ ప్రముఖుల హర్షం

|

Jan 25, 2023 | 1:21 PM

ఆస్కార్‌ తొలిమెట్టుకి చేరిన నాటు నాటు పాట సక్సెస్‌తో ఆస్కార్‌ నామినేషన్స్‌పై ట్రిపుల్‌ ఆర్‌ యూనిట్‌కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. RRR టీమ్‌కి కంగ్రాట్స్‌ చెప్తూ ప్రముఖుల ట్వీట్లు చేశారు. సోషల్‌ మీడియాలో కురుస్తోన్న ప్రశంసల జల్లులో చిత్ర బృందం తడిచి ముద్దవుతోంది.

RRR: భారత సినిమా అద్భుతాలకు ఇది ఆరంభం.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్‌ నామినేషన్స్‌ దక్కడంపై సినీ ప్రముఖుల హర్షం
Naatu Naatu Song
Follow us on

తెలుగు గడ్డపై పురుడుపోసుకున్న తెలుగోడి నాటు పాట తెలుగుదనంలోని గొప్పదనాన్ని విశ్వవేదికపై రెపరెపలాడించింది. ప్రతి నోటా ఆ పాటే….అదే ఇప్పుడు తెలుగు ప్రజల కీర్తి కిరీటంలో కలికితురాయిలా మారబోతోందన్న ఆశను రేకెత్తించింది. అంతా ఊహించినట్టుగానే ప్రపంచ ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డులకు రాజమౌళి ట్రిపులార్‌ సినిమాలోని ఎంఎంకీరవాణి నాటు నాటు పాట నామినేట్‌ అవడంతో భారతీయ చిత్ర పరిశ్రమను ఆనందడోలికల్లో ఓలలాడించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్స్‌కి నాటు నాటు పాట ఎంపికైంది. దేశ విదేశాల్లో..ఒక్కమాటలో చెప్పాలంటే అంతర్జాతీయంగా ప్రేక్షకుల హృదయాలను మీటిన నాటు నాటు పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌ నామినేషన్లకు ఎంపికైన తొలి భారతీయ గీతం కావడం మరో విశేషం. ఇప్పటికే నాటు నాటు పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు లభించింది. క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డుతో పాటు అనేక అవార్డులను సొంతం చేసుకుంది నాటు నాటు పాట. ఆస్కార్‌ తొలిమెట్టుకి చేరిన నాటు నాటు పాట సక్సెస్‌తో ఆస్కార్‌ నామినేషన్స్‌పై ట్రిపుల్‌ ఆర్‌ యూనిట్‌కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. RRR టీమ్‌కి కంగ్రాట్స్‌ చెప్తూ ప్రముఖుల ట్వీట్లు చేశారు. సోషల్‌ మీడియాలో కురుస్తోన్న ప్రశంసల జల్లులో చిత్ర బృందం తడిసి ముద్దవుతోంది.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్‌కు నామినేట్‌ కావడంపై దర్శక ధీరుడు రాజమౌళి స్పందించారు. ‘ నా సినిమాలో నా పెద్దన్న (కీరవాణి) పాటకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ నామినేషన్ వచ్చింది..ఇంతకంటే ఇంకేం కావాలి? ఇప్పుడు నేను తారక్, చరణ్ లను మించిపోయేలా వీరలెవల్లో నాటు నాటు పాటకు డ్యాన్స్ చేస్తున్నాను. చంద్రబోస్ గారూ..అభినందనలు..ఆస్కార్ వేదిక మీద మన పాట..ధన్యవాదాలు.. ప్రేమ్ మాస్టర్ గారూ, పాటకు మీ సహకారం అమూల్యమైనది.. నా వ్యక్తిగత ఆస్కార్ మీకే.. ఇక ఈ పాట విషయంలో చాలాకాలంగా సందిగ్ధంలో ఉన్న నాకు భైరవ బీజీఎం ఎంతో భరోసా అందించింది. ఈ పాటను మరింత ముందుకు తీసుకెళ్లవచ్చన్న నమ్మకం కలిగించింది. థాంక్యూ అండ్‌ లవ్యూ భైరి బాబు. రాహుల్, భైరవల సూపర్ ఎనర్జిటిక్ వోకల్స్ పాటను నెక్ట్స్‌ లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఇక ఈ పాట ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణాలు ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య సమన్వయం, స్టైల్‌. తమదైన శైలిలో వారు చేసిన డ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకింది. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ వేళ నేను పెట్టిన హింసకు వారిద్దరినీ క్షమాపణ కోరుతున్నా. ఛాన్స్ దొరికితే వాళ్లిద్దరినీ మరోసారి ఆడుకోవడానికి నేను వెనుకాడనండోయ్!

ఇవి కూడా చదవండి

‘అసలు నేనెప్పుడూ ఆస్కార్ వరకు వెళతానని అనుకోలేదు. ఇదంతా నాటు నాటు పాటకు, ఆర్ఆర్ఆర్ కు ఉన్న అభిమానుల వల్లే సాధ్యమైంది. వారి అభిమానం చూసిన తర్వాత ఈ పాటను ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన మా మనసుల్లో కలిగింది. వీరాభిమానులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు. ఈ సందర్భంగా కార్తికేయ గురించి చెప్పుకోవాలి. అలుపెరగకుండా, పని రాక్షసుడిలా వ్యవహరించిన కార్తికేయ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. నీ పట్ల గర్విస్తున్నాను కార్తికేయ. ఇక సోషల్ మీడియాలో రోజులో 24 గంటలూ ఆర్ఆర్ఆర్ కు, నాటు నాటు పాటకు ప్రచారం కల్పించడంలో కృషి చేసిన ప్రదీప్, హర్ష, చైతన్యలకు కృతజ్ఞతలు. ఆస్కార్ కు మరొక్క అడుగుదూరంలో ఉన్నాం.. థాంక్యూ!’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు రాజమౌళి.

ఇక ట్రిపుల్‌ ఆర్‌ సినిమాలో కొమురం భీం పాత్ర పోషించిన ఎన్టీఆర్‌ స్పందిస్తూ..ఇదో చిరస్మరణీయ ఘనతగా వ్యాఖ్యానించారు. ఇక లెజెండరీ కీరవాణి, గ్రేటెస్ట్‌ రాజమౌళికి అభినందనలు తెలిపారు ప్రభాస్‌. అలాగే నాటు నాటు ఆస్కార్‌ గెలవాలి అంటూ ట్వీట్‌ చేశారు పవన్ కల్యాణ్‌. ఈ సందర్భంగా కీరవాణి, రాజమౌళికి అభినందనలు తెలిపారుపవర్‌స్టార్‌. భారత సినిమా అద్భుతాలకు ఇది ఆరంభం కావాలంటూ నాని ట్వీట్‌ చేశారు. సినిమాలో మరో హీరో రామ్‌చరణ్‌ నాటు నాటు పాటకోసం పనిచేసిన వారందరికీ ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..