ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పెద్ద సినిమాల సందడి కనిపిస్తుంది. తెలుగు తమిళ్ , హిందీ అనే భేదం లేకుండా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ నుంచి వస్తున్నా సినిమా బ్రహ్మాస్త్ర. రణ్‌బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని, కరణ్ జోహార్, అలియా భట్, అయాన్ ముఖర్జీ కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌లో వస్తున్న ఈ అద్భుతమైన సినిమా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో దర్శక ధీరుడు రాజమౌళి అందిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ సౌత్‌లో కూడా అద్భుతంగా మొదలైంది. కరణ్ జోహార్ నిర్మిస్తున్న బ్రహ్మాస్త్ర సినిమా సౌత్ వర్షన్స్ ప్రజెంట్ చేయడానికి దర్శక ధీరుడు రాజమౌళి వచ్చారు. భారతీయ పురాణాలు అలాగే ఆధునిక ప్రపంచం నుంచి ప్రేరణ పొందిన పురాణ సమ్మేళనం ఈ సినిమా బ్రహ్మాస్త్ర.
2022లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఇది కూడా ఒకటి. ఈ మధ్యే విడుదల తేదీని అనౌన్స్ చేయడంతో పాటు మోషన్ పోస్టర్ కూడా తీసుకొచ్చారు. దీనికి అద్భుతమైన స్పందన వస్తుంది. 09.09.2022న బ్రహ్మాస్త్ర సినిమా విడుదల కానుంది. ఆ రోజు కచ్చితంగా ఇండియన్ సినిమా హిస్టరీలో కొత్త చరిత్ర మొదలవుతుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఈ సినిమా మూడు భాగాలుగా రానుంది. రణబీర్ కపూర్, అలియా భట్, నాగార్జున అక్కినేని, మౌని రాయ్, అమితాబ్ బచ్చన్‌లతో కలిసి మొదటిసారిగా స్క్రీన్ స్పేస్‌ను పంచుకోవడం ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్‌లోకి రాజమౌళి కూడా రావడంతో రేంజ్ ఇంకా పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ సందర్భంగా ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ.. ‘ప్రపంచ వ్యాప్తంగా నాలుగు దక్షిణాది భాషల్లో బ్రహ్మాస్త్రను ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. అనేక విధాలుగా ఈ సినిమా నాకు బాహుబలిని గుర్తు చేస్తుంది. సినిమాపై ప్రేమ, ప్యాషన్ ఉన్న వాళ్లకే ఇలాంటివి సాధ్యమవుతాయి. బాహుబలికి నేను చేసినట్లే అయాన్ ముఖర్జీ కూడా బ్రహ్మాస్త్రను రూపొందించడంలో సమయాన్ని వెచ్చించడం, దాన్ని సరిచేయడానికి ఓపికగా పెట్టడం నేను చూశాను.. ఈ చిత్రం ఆధునిక సాంకేతికతతో పురాతన భారతీయ సంస్కృతికి చెందిన ఇతివృత్తాలను చూపించడంతో పాటు అత్యద్భుతమైన విఎఫ్ఎక్స్‌తో మిమ్మల్ని కట్టి పడేస్తుంది. నేను కూడా ఈ సినిమాలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది. బాహుబలి తర్వాత మరోసారి ధర్మ ప్రొడక్షన్స్‌తో అనుబంధం కలిగి ఉన్నందుకు గర్వపడుతున్నాను అన్నారు. అలాగే మంచి చిత్రాల పట్ల కరణ్‌కు లోతైన అవగాహన ఉంది. అతనితో మళ్లీ భాగస్వామిగా ఉండటం.. ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌తో కలిసి ఈ చిత్రాన్ని అందించడం నాకు గర్వంగా ఉంది..’ అని చెప్పుకొచ్చారు రాజమౌళి.
మరిన్ని ఇక్కడ చదవండి :