S. S. Rajamouli: అనిల్ రావిపూడితో కలిసి రాజమౌళి రచ్చ.. నాటు నాటు పాటకు స్టెప్పులేసిన జక్కన్న..
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఆర్ఆర్ఆర్ ప్రభంజనం కొనసాగుతుంది. ఇప్పటికే ఆలిండియా రికార్డ్స్ ను బద్దలు కొట్టింది ఈ సినిమా.. జక్కన చేసిన మ్యాజిక్ కు అందరు ఫిదా అయ్యారు.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఆర్ఆర్ఆర్(RRR )ప్రభంజనం కొనసాగుతుంది. ఇప్పటికే ఆలిండియా రికార్డ్స్ ను బద్దలు కొట్టింది ఈ సినిమా.. జక్కన చేసిన మ్యాజిక్ కు అందరు ఫిదా అయ్యారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు ఇప్పటికీ క్యూ కడుతున్నారు. సినిమా విడుదలై రెండు వారాలు గడుస్తున్న ఆర్ఆర్ఆర్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకీ ఆర్ఆర్ఆర్ ప్రభంజనం మరింత పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది. కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమా బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేసే దిశగా పరుగులు తీస్తుంది. ఇక ఈ సినిమాలో చరణ్ , తారక్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుల చేత శబాష్ అనిపించేలా ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
అలాగే ఈ సినిమాలో పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కీరవాణి సంగీతం అందించిన ఆర్ఆర్ఆర్ పాటలు సినిమాకు మరో హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా నాటు.. నాటు పాట ఎంత క్లిక్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాటలో చరణ్ , తారక్ డ్యాన్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించింది. ఈపాటలో చరణ్, తారక్ కలిసి చేసిన హుక్ స్టెప్పు విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పటికే చాలా మంది ఈ స్టెప్ వేసి ఆకట్టుకున్నారు. సినిమా ప్రమోషన్స్ లో అందరితో కలిసి తారక్ చరణ్ ఈ స్టెప్పు వేశారు. సల్మాన్ , అమీర్ ఖాన్ సైతం ఈ హుక్ స్టెప్పు వేసి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి వంతు వచ్చింది. ఆర్ఆర్ఆర్ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో సక్సెస్ పార్టీని ఏర్పాటు చేశారు. టాలీవుడ్ దర్శకులంతా ఈ పార్టీకి హాజరయ్యారు. సినిమా విడుదలకు ముందు దర్శకుడు అనిల్ రావిపూడి కి ఇచ్చిన మాట ప్రకారం ఈ సినిమా సక్సెస్ సందర్భంగా అనిల్ తో కలిసి జక్కన్న ఈ పాటకు స్టెప్పు వేశారు. ఈవీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని ఇక్కడ చదవండి :