Rahul Sipligunj: మనసుకు నచ్చిన అమ్మాయితో నిశ్చితార్థం.. అక్కడ ప్రత్యేక పూజలు చేసిన సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌

హైదరాబాదీ పోరడు, టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ త్వరలో పెళ్లిపీటలెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే హరిణ్య రెడ్డి అనే అమ్మాయితో అతని నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. అయితే ఎంగేజ్ మెంట్ పూర్తయిన వెంటనే రాహుల్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించాడు.

Rahul Sipligunj: మనసుకు నచ్చిన అమ్మాయితో నిశ్చితార్థం.. అక్కడ ప్రత్యేక పూజలు చేసిన సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌
Rahul Sipligunj

Updated on: Aug 20, 2025 | 6:18 PM

అటు ప్రొఫెషనల్ లైఫ్ పరంగా కానీ, ఇటు పర్సనల్ లైఫ్ పరంగా కానీ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు అత్యుత్తమ స్థాయిలో ఉన్నాడు. ముందు ప్రైవేట్‌ సాంగ్స్‌తో యూట్యూబ్ లో బాగా వైరల్‌ అయ్యాడు. ఆ తర్వాత బిగ్‌బాస్‌ తెలుగు మూడో సీజన్‌ విన్నర్‌గా నిలిచాడు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌లో పాడిన నాటునాటు సాంగ్‌కు ఆస్కార్‌ రావడంతో ఈ హైదరాబాద్ బస్తీ కుర్రాడి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. ఇక పర్సనల్ లైఫ్ పరంగా చూస్తే.. తన మనసుకు నచ్చిన అమ్మాయితో కలిసి జీవితం పంచుకునేందుకు రెడీ అయ్యాడీ టాలీవుడ్ సింగర్. ఆగస్టు 17న హరిణ్య రెడ్డి అనే అమ్మాయితో కలిసి నిశ్చితార్థం చేసుకున్నాడు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సడన్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని అందరినీ సర్‌ప్రైజ్‌ చేశాడు రాహుల్.తన నిశ్చితార్థం ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా ఇప్పటికీ నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రాహుల్ హరిణ్యలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇదిలా ఉంటే ఎంగేజ్ మెంట్ పూర్తయిన వెంటనే కన్యాకుమారి వెళ్లిపోయాడు రాహుల్ సిప్లిగంజ్. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్ స్టా గ్రామ్ స్టోరీస లో షేర్ చేశాడు.

కాగా నిశ్చితార్థం వేదికపై ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు రాహుల్- హరిణ్య. ఇద్దరూ కలిసి డ్యాన్సులు చేశారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. ఇక చివరిగా ఇదే వేదికపై కాబోయే భార్యకు కాస్ట్‌లీ హ్యాండ్‌బ్యాగ్‌ను బహుమతిగా ఇచ్చాడు రాహుల్. ఇందుకు సంబంధించిన వీడియోను హరిణ్య సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

ఇవి కూడా చదవండి

కాబోయే భార్యకు కాస్ట్ లీ హ్యాండ్ బ్యాగ్

హైదరాబాద్‌ పాతబస్తీలో పుట్టి పెరిగాడు రాహుల్‌ సిప్లిగంజ్‌. చిన్నప్పటినుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నాడు. కుమారుడు ఇష్టాన్ని గమనించిన తండ్రి కూడా గజల్‌ సింగర్‌ పండిట్‌ విఠల్‌ రావు దగ్గర సంగీతంలో శిక్షణ ఇప్పించాడు. ఓపక్క సంగీతం నేర్చుకుంటూనే, మరోపక్క తండ్రికి సెలూన్‌ షాప్‌లో సాయం చేసేవాడు రాహుల్. ఈ క్రమంలోనే ప్రైవేట్ సాంగ్స్ తో యూట్యూబ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మంగమ్మ, పూర్‌ బాయ్‌, గల్లీ కా గణేశ్‌, దావత్‌ తదితర సాంగ్స్ కు యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. నాగ చైతన్య హీరోగా నటించిన జోష్‌ మూవీలో కాలేజీ బుల్లోడా పాటతో చాలా మందికి ఫేవరెట్ గా మారిపోయాడు. దీని తర్వాత వాస్తు బాగుందే.. (దమ్ము), ఈగ టైటిల్‌ సాంగ్‌, సింగరేణుంది (రచ్చ), రంగా రంగా రంగస్థలానా (రంగస్థలం) ఇలా అనేక సూపర్ హిట్ సాంగ్స్‌ పాడాడీ సింగర్.

రాహుల్- హరిణ్యల మరిన్ని ఎంగజ్ మెంట్ ఫొటోస్..


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..