వాయిస్ మారిస్తే నా సినిమాకు కలెక్షన్స్ ఎక్స్‌ట్రా వస్తాయా.? ఆ స్టార్ హీరో అందరిమీద కేకలు వేశారు..

ఎన్నో సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. అలాగే సూపర్ హిట్స్ సాంగ్స్ అందించారు రఘు కుంచె. కానీ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా పెద్దగా అవంశాలు అందుకోలేకపోయారు రఘు. కాగా నటుడిగా రాణిస్తున్నారు రఘు. పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకుంటున్నారు రఘు.

వాయిస్ మారిస్తే నా సినిమాకు కలెక్షన్స్ ఎక్స్‌ట్రా వస్తాయా.? ఆ స్టార్ హీరో అందరిమీద కేకలు వేశారు..
Raghu Kunche

Updated on: Apr 01, 2026 | 10:21 AM

సింగర్ గా మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు రఘు కుంచె. అలాగే నటుడిగానూ సినిమాల్లో నటించి మెప్పించారు రఘు కుంచె. తాజాగా రఘు కుంచె మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ అద్భుతమైన సంఘటనను పంచుకున్నారు. మృగరాజు సినిమాలోని హంగామా హంగామా అనే క్లైమాక్స్ పాటను తొలుత రఘు కుంచె ఆలపించారు. అప్పటికి యాంకర్ గా ఉన్న రఘు కుంచె, ఏడిద శ్రీరామ్ ద్వారా చిరంజీవికి పరిచయం అయ్యారు. చిరంజీవి షూటింగ్ సెట్స్‌లో సాధారణంగా అందరితో కలిసి సరదాగా మాట్లాడటం, భోజనం పెట్టించడం వంటివి చేస్తుంటారని, ఆయన వ్యక్తిత్వం అద్భుతమని రఘు కుంచె ప్రశంసించారు. హంగామా హంగామా పాట ట్రాక్ ను రికార్డు చేసిన తర్వాత, అది చిరంజీవికి వినిపించారట. పాట విన్న చిరంజీవి చాలా బావుంది రఘు అని మెచ్చుకున్నారు. సాధారణంగా చిరంజీవి ఏ నిర్ణయం తీసుకునే ముందు కూడా అందరి అభిప్రాయాలను తీసుకుంటారని రఘు కుంచె వెల్లడించారు. ఈ పాట విషయంలో కూడా ఆయన ఓకే చేసిన తర్వాత, రఘు కుంచె వాయిస్ ను లాక్ చేశారు. అయితే, అనూహ్యంగా కొన్ని రోజుల తర్వాత, ఆ పాటను కేకేతో పాడించారనే వార్త రఘు కుంచెకు తెలిసిందట.

ఆమె హీరోయినా.. అస్సలు వద్దు..! డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పిన విజయ్ సేతుపతి

కేకే అప్పటికే ఒక ప్రముఖ సింగర్ కావడంతో, సినిమాకు ఒక “బాంబే ఆల్బమ్” లుక్ ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కేకే, శంకర్ మహదేవన్, ఉదిత్ నారాయణ్, సుఖ్వీందర్ సింగ్, హరిహరన్ వంటి పెద్ద సింగర్ల మధ్య రఘు కుంచె పేరు కాస్త నాన్-సింక్ గా అనిపించి ఉండవచ్చని రఘు కుంచె అభిప్రాయపడ్డారు. తన వాయిస్‌ను మార్చారన్న సమాచారం తెలిసిన వెంటనే, రఘు కుంచె చిరంజీవికి ఈ విషయం తెలియజేశారట. చిరంజీవికి ఈ మార్పు గురించి తెలియదని రఘు కుంచె తెలిపారు. వెంటనే శబ్దాలయ స్టూడియోకు చేరుకున్న చిరంజీవి, తన అనుమతి లేకుండా పాటలో గాయకుడిని మార్చినందుకు అక్కడున్న వారందరిపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

“ఎందుకు మార్చారు.? మార్చాల్సిన అవసరం ఏముంది.? నాకు చెప్పాలి కదా.? ఇప్పుడు వాయిస్ మార్చడం వల్ల నా సినిమాకు ఇంకో యాభై కోట్లు కలెక్షన్లు ఎక్స్‌ట్రా వస్తాయా.?” అంటూ గట్టిగా ప్రశ్నించారట. ఈ సంఘటన తర్వాత, రఘు కుంచె వాయిస్‌ను తిరిగి పాటలో పెట్టారట. ఈ విషయం సినిమా ఇండస్ట్రీలో సాధారణమని, కొందరికి ఒక గాయకుడి వాయిస్ నచ్చకపోవచ్చని రఘు కుంచె అన్నారు. అయితే, చిరంజీవి చూపించిన నిబద్ధత, కళాకారులకు ఆయన ఇచ్చే విలువ అపారమైనదని ఈ సంఘటన నిరూపించిందని అన్నారు. ఈ సంఘటనను పంచుకుంటూ రఘు కుంచె తన వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు. తనలోని స్కిల్ ను పెంచుకున్నప్పటికీ, ఇండస్ట్రీలో భజన చేయడంలో తాను వెనుకబడ్డానని అన్నారు. ఒకసారి అవకాశం వచ్చినా, భజన అలవాటు లేకపోవడం వల్ల మళ్లీ రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us