బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు కీర్తి భట్. సూపర్ హిట్ సీరియల్ 'కార్తీకదీపం'లో హిమ పాత్రలో నటించి, తనదైన నటనతో మెప్పించింది.
తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్‌బాస్ తెలుగు సీజన్-6 లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి, తన ఆటతీరుతో టాప్-5 వరకు దూసుకెళ్లింది.
నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ కన్నడ బ్యూటీ.. తాజాగా తన ఇన్ స్టాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
ప్రస్తుతం ఒక వెకేషన్‌లో ఉన్న కీర్తి భట్, సముద్ర తీరాన (బీచ్‌లో) దిగిన కొన్ని గ్లామరస్ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. ఆ ఫోటోస్ ఇప్పుడు వైరలవుతున్నాయి.
సీరియల్స్‌లో పద్ధతిగా, లంగా ఓణీలు, చీరల్లో కనిపించే కీర్తి.. ఈ ఫోటో షూట్‌లో మాత్రం సరికొత్త మోడ్రన్ లుక్‌లో దర్శనమిచ్చింది. ఆమె ఇచ్చిన ఫోజులు ఆకట్టుకుంటున్నాయి.
ఈ లేటెస్ట్ ఫోటోలను చూసిన నెటిజన్లు, అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. "కీర్తి చాలా స్టైలిష్‌గా, హాట్‌గా ఉంది", "బుల్లితెర దేవత ఇప్పుడు బీచ్ బేబ్‌గా మారిపోయింది"
గతంలో కొన్ని వ్యక్తిగత జీవిత గమనాల్లో ఎన్నో ఒడిదుడుకులను, కష్టాలను ఎదుర్కొన్న కీర్తి, వాటన్నింటినీ అధిగమించి లైఫ్‌ను పాజిటివ్‌గా లీడ్ చేస్తోంది.
ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతుండగా.. అటు తెుగుతోపాటు అటు తమిళంలోనూ వరుస సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటుంది కీర్తి భట్. ఆమె ఫోటోస్ వైరలవుతున్నాయి