కూతురి చదువు కోసం చనిపోయిన భార్య తాళిని తాకట్టుపెట్టిన తండ్రి.. లారెన్స్ ఏం చేశారో తెలిస్తే శభాష్ అంటారు

కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్. ఈ మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఎంతో కష్టపడి ఎదిగాడు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.తన డాన్స్ తో ఇండస్ట్రీనే ఊపేశాడు. స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా చేసి స్టెప్పులేయించాడు. కెరీర్ తొలినాళ్లలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన లారెన్స్.. ఆ తర్వాత హీరోగా అలరించాడు.

కూతురి చదువు కోసం చనిపోయిన భార్య తాళిని తాకట్టుపెట్టిన తండ్రి.. లారెన్స్ ఏం చేశారో తెలిస్తే  శభాష్ అంటారు
Raghava Lawrence

Updated on: Aug 18, 2025 | 12:44 PM

చాలా మంది నటులు కేవలం సినిమాలతోనే కాదు వ్యక్తిగతంగా, సామాజిక సేవ ద్వారా కూడా అభిమానులను సొంతం చేసుకుంటూ ఉంటారు. వారిలో ముందు వరసలో ఉండే పేరు రాఘవ లారెన్స్. డాన్స్ కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత నటుడిగా , దర్శకుడిగా రాణించారు లారెన్స్. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించడమే కాదు .. దర్శకుడిగానూ సూపర్ హిట్స్ అందించారు లారెన్స్. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తమిళ్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు లారెన్స్. మాత్రం ఫౌండేషన్‌ స్థాపించి ఎంతో మందికి సాయం చేశారు లారెన్స్. ఎంతో మంది పేద విద్యార్థులు అండగా నిలిచారు. అలాగే దివ్యంగులకు ఎంతో సాయం అందించారు లారెన్స్.

సీరియల్‌లో తల్లి.. బయట మాత్రం భార్య.! ఎనిమిదేళ్ల చిన్నవాడిని పెళ్లాడిన ఈ నటి ఎవరంటే

వీటితో పాటు సోషల్ మీడియా ద్వారా ఎవరికైనా కష్టం ఉంది అని తెలుసుకుంటే వెంటనే స్పందించి వారికి సాయం చేశారు లారెన్స్. ఆర్థిక సమస్య ఉన్నవారికి డబ్బు సాయం చేశారు. ఇల్లు లేనివారికి ఇల్లు కట్టించారు. చదువుకోవాలని ఆశ ఉన్న స్థోమత లేని వారికి  అండగా నిలిచారు లారెన్స్. తాజాగా ఆయన మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. కూతురి చదువు కోసం ఓ తండ్రి పడుతున్న కష్టానికి చలించిపోయారు లారెన్స్.

ఇవి కూడా చదవండి

14 ఏళ్లల్లోనే ఎంట్రీ.. 300కి పైగా సినిమాలు.. ఇప్పటికీ అదే అందం.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఓ మిడిల్ క్లాస్ తండ్రి కూతురి చదువు కోసం డబ్బులు లేక.. చనిపోయిన తన భార్య మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టాడు. ఆ సంఘటన తనను ఎమోషనల్ గా కదిలించిందన్నారు లారెన్స్. సోషల్ మీడియాలో ఓ వీడియో పంచుకుంటూ..  చనిపోయిన భార్య మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి కూతురిని చదివించిన ఘటన తనను కదిలించిందని తెలిపారు. ఎందుకంటే ఒకప్పుడు నా కుటుంబం కూడా అదే పరిస్థితి ఎదుర్కుంది. అందుకే ఆ తాళిని విడిపించి ఆయనకు తిరిగి అందించా.. అది కేవలం బంగారం మాత్రమే కాదు ఆయన భార్య గుర్తుగా ఉంచుకున్న అమూల్యమైన జ్ఞాపకం అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు లారెన్స్.

సీన్ సీన్‌కు సితారే..! ఒంటరిగా అస్సలు చూడకండి.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ మూవీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.