Raghava Lawrence: నిన్ను కొట్టను.. వచ్చి నన్ను కలువు రా.. లారెన్స్ ఎమోషనల్ పోస్ట్..

కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ గురించి చెప్పక్కర్లేదు. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్నారు. అలాగే ఆయన చేసే సహాయ కార్యక్రమాల గురించి తెలిసిందే. ఎంతో మంది పేదలకు అండగా ఉంటారు. తాజాగా లారెన్స్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది.

Raghava Lawrence: నిన్ను కొట్టను.. వచ్చి నన్ను కలువు రా.. లారెన్స్ ఎమోషనల్ పోస్ట్..
Lawrence

Updated on: Jun 29, 2025 | 11:23 AM

రాఘవ లారెన్స్.. పెద్దగా పరిచయం అవసరంలేని పేరు. నటుడిగా, కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా, నిర్మాతగా దక్షిణాది సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరించారు. కానీ కొన్నాళ్లుగా లారెన్స్ సినిమాల్లో అంతగా కనిపించడం లేదు. హీరోగా వెండితెరపై సందడి చేయడమే కాకుండా ఎంతో మందికి అండగా నిలిచారు. లారెన్స్ చేసే సహాయ కార్యక్రమాల గురించి తెలిసిందే. సొంతంగా ఆశ్రమాలు నిర్మించి ఎంతో మంది పేదలకు నీడను కల్పించారు. కష్టంలో ఉన్నవారికి సాయం చేశారు. అలాగే ఆయన నడిపించే ఆశ్రమాలు వృద్ధులకు, అనాథ పిల్లల ఆకలి తీరుస్తున్నాయి. అలాగే అనాథ పిల్లలకు విద్యను అందిస్తున్నారు. లారెన్స్ ఇప్పటివరకు ఎంతో మంది చిన్నారులను చదివించి వారికి మంచి జీవితాన్ని అందించారు. అయితే మాస్ సినిమా సమయంలో ఆయన ఓ చైల్డ్ ఆర్టిస్టును దత్తత తీసుకుని చదవించారట. అతడే రవి రాథోడ్.

విక్రమార్కుడు, మాస్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించాడు రవి రాథోడ్. మాస్ సినిమా సమయంలోనే రవి రాథోడ్ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. దీంతో ఆ పిల్లాడిని లారెన్స్ దత్తత తీసుకున్నారట. అతడిని స్కూల్లో జాయిన్ చేసి.. అన్ని రకాల ఆర్థిక సాయాన్ని అందించారట. కానీ అప్పుడు ఆ పిల్లాడు స్కూల్ నుంచి తప్పించుకోని వెళ్లిపోవడంతో.. అప్పటి నుంచి ఆ పిల్లాడి కోసం లారెన్స్ వెతుకుతూనే ఉన్నారట. తాజాగా ఆ పిల్లాడి జాడ దొరకడంతో సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు లారెన్స్.

ఇవి కూడా చదవండి

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు రవి రాథోడ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో లారెన్స్ గురించి మాట్లాడుతూ.. ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్తే కొడతారో.. తిడతారో అనే భయం ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియో కాస్త లారెన్స్ దగ్గరకు చేరింది. ఇది చూసిన లారెన్స్ ఆ అతడిని ఒక్కసారి కలువు అంటూ ట్వీట్ చేశారు. “నిన్ను ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. కన్నీళ్లు ఆగడం లేదు. మాస్ సినిమా సమయంలో నేను నిన్ను స్కూల్లో జాయిన్ చేశఆను. ఈ ఏడాది తరువాత నువ్వు మిస్ అయ్యావ్. అప్పటి నుంచి నీకోసం వెతుకుతూనే ఉన్నాను. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ నిన్ను చూడడం ఎంతో సంతోషంగా ఉందిరా.. వదిలి వెళ్లినందుకు నిన్ను కొడతాను.. తిడతాను అని నువ్వు భయపడుతున్నావ్.. కానీ నేనేమి అలా చేయను. ఒకసారి వచ్చి కలువు. నిన్ను చూడాలి ” అంటూ ట్వీట్ చేశారు లారెన్స్. ప్రస్తుతం ఆయన వేసిన పోస్ట్ అందరినీ కదిలిస్తోంది.

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..