Pooja Hegde: రాధేశ్యామ్ టీజర్‌ వచ్చేది ఆ రోజే… క్లారిటీ ఇచ్చిన బుట్టబొమ్మ.. డబ్బింగ్‌ చెబుతూ..

Radhe Shyam Teaser Coming On: ప్రభాస్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. 'సాహో' తర్వాత ప్రభాస్‌ నటించిన చిత్రానికి సంబంధించిన తొలి టీజర్‌ రానుంది. ఈ విషయాన్ని హీరోయిన్‌ పూజా..

Pooja Hegde: రాధేశ్యామ్ టీజర్‌ వచ్చేది ఆ రోజే... క్లారిటీ ఇచ్చిన బుట్టబొమ్మ.. డబ్బింగ్‌ చెబుతూ..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 09, 2021 | 11:18 PM

Radhe Shyam Teaser Coming On: ప్రభాస్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ‘సాహో’ తర్వాత ప్రభాస్‌ నటించిన చిత్రానికి సంబంధించిన తొలి టీజర్‌ రానుంది. ఈ విషయాన్ని హీరోయిన్‌ పూజా హెగ్దే స్వయంగా తెలిపింది. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌, పూజా హెగ్దే జంటగా నటిస్తోన్న ‘రాధే శ్యామ్‌’ టీజర్‌ వస్తుందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలను నిజం చేస్తూ పూజా హెగ్దే ట్విట్టర్‌ వేదికగా ఓ ఆసక్తికరమైన ట్వీట్‌ చేసింది. రాధేశ్యామ్ చిత్ర టీజర్‌ కోసం డబ్బింగ్ చెప్తోన్న సమయంలో తీసిన ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘ఉదయాన్నే మా టీజర్‌ కోసం డబ్బింగ్ చెప్తున్నాను. ఫిబ్రవరి 14న టీజర్‌ రానుంది’ అంటూ క్యాప్షన్‌ జోడించిందీ బ్యూటీ. ఈ అందమైన ప్రేమ కథ టీజర్‌ను ప్రేమికుల దినోత్సవం రోజు విడుదల చేస్తుండడంతో ప్రభాస్‌ అభిమానుల్లో జోష్‌ నిండింది. ఇక ప్యాన్‌ ఇండియా నేపథ్యంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. మరి సినిమా ఫస్ట్‌లుక్‌తోనే సంచలనం సృష్టించిన ‘రాధేశ్యామ్‌’ టీజర్‌తో ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.

Also Read: ‘ఉప్పెన’కు అద్భుతమైన సంగీతం అందించిన రాక్ స్టార్.. దేవీ శ్రీ ట్యూన్ కి స్టెప్పులేసి సుకుమార్.. వీడియో వైరల్