RRR Movie :చివరి దశలో ‘ఆర్ఆర్ఆర్’షూటింగ్.. ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడేనా..

ఆర్.ఆర్‌.ఆర్‌ చిత్రానికి సంబంధించి ఏ చిన్న వార్త బయటకు వచ్చినా అది వైరల్‌గా మారుతోంది. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిమ్‌ సిటీలో షూటింగ్‌ జరుపుకుంటోంది..

RRR Movie :చివరి దశలో 'ఆర్ఆర్ఆర్'షూటింగ్..  ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడేనా..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 09, 2021 | 11:26 PM

RRR Movie  : ఆర్.ఆర్‌.ఆర్‌ చిత్రానికి సంబంధించి ఏ చిన్న వార్త బయటకు వచ్చినా అది వైరల్‌గా మారుతోంది. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిమ్‌ సిటీలో షూటింగ్‌ జరుపుకుంటోంది. క్లైమాక్స్‌ సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా భారీ సెట్‌ను ఏర్పాటు చేశారు. మెగాపవర్ స్టార్ , యంగ్ టైగర్ కలిసి నటిస్తున్న సినిమా పైగా దర్శకదీరుడు రాజమౌళి డైరెక్షన్ దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఆ మధ్య విడుదల చేసిన చరణ్ , తారక్ టీజర్లు ఆ అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

టాకీ మార్చి చివరి నాటికి పూర్తవుతుంది. నెలాఖరు నాటికే పతాక సన్నివేశాల్ని పూర్తి చేస్తున్నారట.ఏప్రిల్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టనున్నారు. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బిజినెస్ కూడా అదే రేంజులో జరుగుతుంది. కాగా ఈ సినిమా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా రిజీచేయనున్న విషయం తెలిసిందే. అయితే రిలీజ్ కు సరిగ్గా నెలరోజుల ముందు ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరపనున్నారంట. ఇక అదే రోజు సినిమా ట్రైలర్ ను కూడా లాంచ్ చేస్తారని ఫిలింనగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

‘ఉప్పెన’కు అద్భుతమైన సంగీతం అందించిన రాక్ స్టార్.. దేవీ శ్రీ ట్యూన్ కి స్టెప్పులేసి సుకుమార్.. వీడియో వైరల్