‘ఉప్పెన’కు అద్భుతమైన సంగీతం అందించిన రాక్ స్టార్.. దేవీ శ్రీ ట్యూన్ కి స్టెప్పులేసి సుకుమార్.. వీడియో వైరల్
ఒక సినిమా విజయంలో కొంతభాగం సంగీతానికి ఉంటుంది. ఎలాంటి కథకైనా చక్కటి సంగీతం తోడైతే సినిమా ప్రేక్షకులను మెప్పించడం ఖాయం. అలాగే కొన్ని సినిమాలు హిట్ అవ్వక పోయిన..
Devi Sri Prasad : ఒక సినిమా విజయంలో కొంతభాగం సంగీతానికి ఉంటుంది. ఎలాంటి కథకైనా చక్కటి సంగీతం తోడైతే సినిమా ప్రేక్షకులను మెప్పించడం ఖాయం. అలాగే కొన్ని సినిమాలు హిట్ అవ్వక పోయిన సంగీతం ఆకట్టుకుంటుంది. ఇక టాలీవుడ్ సంగీత దర్శకుల్లో దేవీ శ్రీ ప్రసాద్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన సంగీతంతో దేవీశ్రీ ప్రసాద్ టాలీవుడ్ లో రాణిస్తున్నారు. త్వరలో దేవీశ్రీ సంగీతం అందించిన అందమైన ప్రేమ కథ ‘ఉప్పెన’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఉప్పెన సినిమా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు దేవీ శ్రీ అందించిన సంగీతం అలరిస్తుంది. ముఖ్యంగా ‘నీ కన్ను నీలి సముద్రం’ పాట యువతను విశేషంగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఉప్పెన సినిమాలో రంగులద్దుకున్న పాటకు ట్యూన్ కడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను దేవీశ్రీ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. లిరిక్ రైటర్ చంద్రబోస్ సమక్షంలో…పాట కంపోస్ చేస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన దర్శకుడు సుకుమార్ దేవీ శ్రీ గిటార్ వాయిస్తుంటే దానికి తాగగట్టుగా చిన్న స్టెప్పుకూడా వేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఉప్పెన సినిమాకు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తుండగా వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు.
Here’s d Original #Ranguladdhukunna Composing??
When I heard d Situation n composed Instantly n d Fun We all had
U can see Suku Bhai Dance??@MythriOfficial @aryasukku @BuchiBabuSana @ShreeLyricist @HariPriyaSinger @IamKrithiShetty @VaisshnavTej https://t.co/alQcI7pvwD
— DEVI SRI PRASAD (@ThisIsDSP) February 9, 2021