Naga chaitanya: భార్య బాటలో నడవనున్న భర్త.. వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న అక్కినేని హీరో..
Naga chaitanya Act In Web Series: ప్రస్తుతం అంతా వెబ్ సిరీస్‌ల హవా నడుస్తోంది. ఓటీటీ వ్యాపారం రోజురోజుకీ పెరుగుతుండడం.. బడా నిర్మాణ సంస్థలు సైతం ఈ రంగంలోకి...
Naga chaitanya Act In Web Series: ప్రస్తుతం అంతా వెబ్ సిరీస్‌ల హవా నడుస్తోంది. ఓటీటీ వ్యాపారం రోజురోజుకీ పెరుగుతుండడం.. బడా నిర్మాణ సంస్థలు సైతం ఈ రంగంలోకి అడుగుపెట్టడంతో బడా సినీ తారలు సైతం వెబ్ సిరీస్‌లో నటిస్తూ వస్తున్నారు. తెలుగులో తొలిసారి వెబ్ సిరీస్‌లో నటించిన అందరి దృష్టిని ఆకర్షించింది అందాల తార అక్కినేని సమంత. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌లో ఈ బ్యూటీ నటించన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే భార్య సమంత బాటలో నడవడానికి నాగచైతన్య సిద్ధమవుతున్నాడని ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. అమేజాన్ ప్రైమ్ కోసం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కనుందని ఇందులో నాగ చైతన్య హీరోగా నటించనున్నాడనేది సదరు వార్త సారాంశం. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో చై ఈ సినిమాకు వెంటనే ఓకే చెప్పాడని సమాచారం. ఈ వెబ్ సిరీస్ వచ్చే ఏడాది నుంచి ప్రారంభంకానున్నట్లు సమాచారం. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.