Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan-Krish Movie: పవన్‌ కోసం భారీ చార్మినార్‌ సెట్‌… ప్రేక్షకులను 300 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లనున్న దర్శకుడు..

Charminar Set For Pawan-Krish Movie: రాజకీయాల్లో బిజీగా మారిన పవన్‌ సినిమాలకు బ్రేక్‌ ఇవ్వడంతో ఆయన అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తూ ...

Pawan-Krish Movie: పవన్‌ కోసం భారీ చార్మినార్‌ సెట్‌... ప్రేక్షకులను 300 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లనున్న దర్శకుడు..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 09, 2021 | 8:22 PM

Charminar Set For Pawan-Krish Movie: రాజకీయాల్లో బిజీగా మారిన పవన్‌ సినిమాలకు బ్రేక్‌ ఇవ్వడంతో ఆయన అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తూ ‘వకీల్‌ సాబ్‌’ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వడానికి పవన్‌ సిద్ధమయ్యాడు. కేవలం ఒక సినిమాయే కాకుండా ఒకేసారి ఏకంగా మూడు సినిమాలకు సైన్‌ చేసి అభిమానుల్లో జోష్‌ నింపాడు. ఈ మూడు చిత్రాల్లో క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఒకటి. పవన్‌ 27వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం ఈ సినిమా పీరియాడిక్‌ నేపథ్యంలో తెరకెక్కుతుండడమే. మొగల్‌ సామ్రాజ్యంలో ఓ బందిపోటు పాత్రలో పవన్‌ కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా కథ 17వ దశాబ్దం నాటి సమయంలో జరనుండడంతో.. దర్శకుడు క్రిష్‌ భారీ సెట్లకు ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే చార్మినర్‌ సెట్‌ను నిర్మించనున్నారని సమాచారం. ఈ సినిమా ద్వారా దర్శకుడు ప్రేక్షకులను 300 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లనున్నాడన్నమాట. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో పవన్‌ సరసనగా నిధి అగర్వాల్‌ నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

Also Read: Regina Cassandra : జోరు తగ్గించిన రెజీనా.. టాలీవుడ్ వదిలి కోలీవుడ్ కు.. అమ్మడి ఆశలన్నీ ఆ సినిమా పైనే..