AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raashi Khanna: సైకో కిల్లర్‌‌‌గా మారనున్న బాబ్లీ బ్యూటీ.. రాశిఖన్నా నయా వెబ్ సిరీస్

అందాల రాశిఖన్నా సైలెంట్ గా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ అమ్మడి చేతిలో నాలుగైదు సినిమాలు..

Raashi Khanna: సైకో కిల్లర్‌‌‌గా మారనున్న బాబ్లీ బ్యూటీ.. రాశిఖన్నా నయా వెబ్ సిరీస్
Raashikhanna
Rajeev Rayala
|

Updated on: Jul 28, 2021 | 7:50 AM

Share

Raashi Khanna: అందాల రాశిఖన్నా సైలెంట్‌‌‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ అమ్మడి చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. తెలుగుతోపాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ ఈ చిన్నది ఆఫర్లు దక్కించుకొంటుంది. ఊహలు గుసగుసలాడే సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన ఈ బాబ్లీ బ్యూటీ..ఆతర్వాత టాలీవుడ్ యంగ్ హీరోలందరిసారసన నటించి ఆకట్టుకుంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ, సాయి తేజ్ ప్రతిరోజు పండగే వంటి సినిమాలతో మంచి హిట్‌‌‌‌లను తనఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు రాశిఖన్నా డిజిటల్ వరల్డ్‌‌‌‌లోకి అడుగు పెట్టేందుకు రెడీ అయ్యింది. ఏకంగా రెండు వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌లతో ఆకట్టుకునేందుకు ఈ బ్యూటీ సిద్ధమయ్యిందని తెలుస్తోంది.  ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌‌‌తో ఆకట్టుకున్న రాజ్ – డీకే రూపొందిస్తున్న ఓ వెబ్ సిరీస్‌‌‌లో రాశీఖన్నా కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సిరీస్‌‌‌‌లో స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తోన్నాడు.

అలాగే ఈ సిరీస్ తోపాటుగా ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్’ అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌‌‌‌లో రాశీ ఛాన్స్ దక్కించుకుందని వార్తలు వినిపిస్తోన్నాయి. రాజేష్ మపుస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్‌‌‌‌లో అజయ్ దేవగన్ హీరోగా నాటితోన్నారు. ఈ సిరీస్‌‌‌లో రాశి సైకో కిల్లర్‌‌‌గా కనిపించనుందని టాక్. డిస్నీ+ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా ఈ సిరీస్ విడుదల కానుంది. ఇక ఈ అమ్మడి తెలుగు సినిమాల విషయానికొస్తే ప్రస్తతం నాగచైతన్య- విక్రమ్ కుమార్ కాంబినేషన్‌‌‌లో వస్తోన్న థాంక్యూ సినిమాలో హీరోయిన్‌‌‌గా చేస్తోంది. అలాగే గోపీచంద్ -మారుతీ డైరెక్షన్‌‌‌‌లో రాబోతోన్న పక్కా కమర్షియల్ మూవీలోనూ రాశినే హీరోయిన్.

మరిన్ని ఇక్కడ చదవండి :

Disney + hotstar: యూజర్లను పెంచుకునే పనిలో పడ్డ హాట్‌స్టార్‌.. కొత్తగా మూడు ప్లాన్స్‌ను తీసుకొచ్చిన ప్రముఖ ఓటీటీ.

Rashmika Mandanna: మెగాఆఫర్ దక్కించుకున్న లక్కీ బ్యూటీ.. చరణ్ సినిమాలో ఛాన్స్..

Hero Nani: నిత్యావసర సరుకులు పెరుగుతున్నా పట్టించుకోరు.. కానీ థియేటర్లపై ఆంక్షలు: హీరో నాని సంచలన వ్యాఖ్యలు..!