Shraddha Srinath: ఆ హీరోను ఉద్దేశించి హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ సర్‌క్యాస్టిక్ పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్
అప్పటిదాకా సైలెంట్‌గా ఉన్న స్టార్లు ఒక ట్వీట్‌తోనో, చిన్న పోస్ట్ తోనో సడన్‌గా లైమ్‌లైట్‌లోకి రావడాన్ని మనం అప్పుడప్పుడూ చూస్తూ ఉంటాం. ఇప్పుడు అలాంటి ఫ్లడ్‌లైట్ ఫోకస్ పడింది శ్రద్ధా శ్రీనాథ్ మీద. ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో పెట్టిన థాట్‌ఫుల్ పోస్ట్ ఇప్పుడు...
Shraddha Srinath: అప్పటిదాకా సైలెంట్‌గా ఉన్న స్టార్లు ఒక ట్వీట్‌తోనో, చిన్న పోస్ట్ తోనో సడన్‌గా లైమ్‌లైట్‌లోకి రావడాన్ని మనం అప్పుడప్పుడూ చూస్తూ ఉంటాం. ఇప్పుడు అలాంటి ఫ్లడ్‌లైట్ ఫోకస్ పడింది శ్రద్ధా శ్రీనాథ్ మీద. ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో పెట్టిన థాట్‌ఫుల్ పోస్ట్ ఇప్పుడు నార్త్ టు సౌత్ ఓ స్పెషల్ అట్రాక్షన్. ప్యాన్ ఇండియా హీరోయిన్ల లిస్టు చెప్పాల్సి వచ్చినప్పుడు అందులో శ్రద్ధా శ్రీనాథ్ పేరు తప్పకుండా ఉంటుంది. కాశ్మీర్ టు కన్యాకుమారి ఎప్పుడూ ఏదో ఒక లాంగ్వేజ్‌లో మూవీలు చేస్తూనే ఉంటారు శ్రద్ధా. జెర్సీతో తెలుగువారికి బాగా కనెక్టయిన ఈ నేచురల్ ఆర్టిస్ట్ కి 2020లో ‘కృష్ణా అండ్ హిస్ లీలా’ అనే ఓటీటీ మూవీ కూడా మంచి పేరే తెచ్చిపెట్టింది.
‘జెర్సీ’ బాలీవుడ్ వెర్షన్‌లో శ్రద్ధ నటించకపోయినప్పటికీ, ఆమె మాత్రం నార్త్ ఆడియన్స్ కి సుపరిచితురాలే. అందుకే ఆమె చేసిన ఓ పోస్ట్ ఇంట్రస్టింగ్‌గా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ పోస్టు చేసింది రీసెంట్లీ మేరీడ్ హీరో వరుణ్ ధావన్ గురించి…. ”వరుణ్ ధావన్‌కి పెళ్లయిపోతోంది. అయ్యో… మనం ఇక అతన్ని స్క్రీన్ మీద చూడలేమేమో. అతని భార్యా, అత్తారింటివారూ అతను మిగిలిన హీరోయిన్ల పక్కన నటించడాన్ని అంగీకరించరేమో. మేల్ ఓరియంటెడ్ సినిమాలకే ఇక పరిమితమవుతారేమో. అయినా అతను వ్యక్తిగత జీవితాన్ని, ప్రొఫెషన్‌ని ఎలా బ్యాలన్స్ చేస్తారు? కష్టమే. మనం ఆయన్ని మిస్ కావాల్సిందే…. అంటూ సర్‌క్యాస్టిక్‌గా పోస్ట్ చేశారు ఈ హీరోయిన్.
మామూలుగా హీరోయిన్‌కి పెళ్లవుతుందంటే రెయిజ్ అయ్యే అన్ని రకాల డౌట్స్ నీ, శ్రద్దా… ఓ హీరోను ఉద్దేశించి పోస్ట్ చేయడంతో అంతా కొత్తగా ఫీలవుతున్నారు. అన్నట్టు ఈ ముద్దుగుమ్మ ఖాతాలో విశాల్ ‘చక్ర’తో పాటు అరడజను సినిమాలున్నాయి.