Varun Tej: ‘ఆచార్య టీజర్‌కు చరణ్ అన్న వాయిస్ ఓవర్ అంటగా.. బయట టాక్’.. ఫన్నీ మీమ్ షేర్ చేసిన వరుణ్..

Varun Tej Tag A Meme To Chiru: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. కాజల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి...

Varun Tej: ‘ఆచార్య టీజర్‌కు చరణ్ అన్న వాయిస్ ఓవర్ అంటగా.. బయట టాక్’.. ఫన్నీ మీమ్ షేర్ చేసిన వరుణ్..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 27, 2021 | 7:58 PM

Varun Tej Tag A Meme To Chiru: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. కాజల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇక దేవాదాలయ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తుండడంతో ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ మారింది. అందులోనూ ఇప్పటి వరకు అపజయం అంటూ ఎరగని కొరటాల దర్శకత్వం వహిస్తుండడంతో సహజంగానే ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ సాధిస్తుందని అంతా భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఆచార్య చిత్ర యూనిట్.. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను జనవరి 29న సాయంత్రం 4.05గంటలకు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ చిరంజీవి పోస్ట్ చేసిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఎవయ్యా కొరటాల టీజర్ రిలీజ్ చేస్తావా..? లేదా నన్ను లీక్ చేయమంటావా’..? అన్న ప్రశ్నకు కొరటాల స్పందిస్తూ.. ‘రేపు మార్నింగ్ ఇచ్చేస్తా సార్’ అని చెబుతున్నట్లు ఉన్న మీమ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ టీజర్ విషయమై మరో యంగ్ హీరో వరుణ్ తేజ్ మరో కొత్త మీమ్‌ను పోస్ట్ చేశాడు. ‘చరణ్‌ అన్న వాయిస్‌ ఓవర్‌ అంటగా టీజర్‌కి.. బయట టాక్‌..’ అంటూ చిరంజీవి, రామ్‌చరణ్‌లను ట్యాగ్‌ చేస్తూ బ్రహ్మానందం ఫొటోతో తయారు చేసిన మీమ్‌ను అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ మీమ్ నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది.

Also Read: Shraddha Srinath: ఆ హీరోను ఉద్దేశించి హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌ సర్‌క్యాస్టిక్ పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్