ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. ముందు నుంచి మేకర్స్ చెప్పినట్లుగానే మొదటి రోజే వసూళ్లు సునామీ సృష్టించింది ఈ మూవీ. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్స్ బద్దలు కొట్టింది ఈ చిత్రం. ఇక తాజాగా మొదటి రోజే పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సునామీ సృష్టించింది. వరల్డ్ వైడ్ గా పుష్ప 2 మొదటి రోజు 294 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు పుష్ప 2 నిర్మాతలు.
భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకూ ఏ చిత్రం సాధించని విధంగా తొలిరోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా పుష్ప 2 రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ విషయంలో ఇండియా నెం.1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు. అలాగే బన్నీ దెబ్బకు బాలీవుడ్ టాప్ రికార్డ్స్ సైతం గల్లంతయ్యాయి. పుష్ప 2 చిత్రం హిందీలో 72 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ఈ వీకెండ్ పుష్ప 2 వసూళ్లు మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఓవర్సీస్ లో పుష్పరాజ్ మానియా కంటిన్యూ అవుతుంది.
డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో బన్నీ తన నటవిశ్వరూపం చూపించారు. ఈ చిత్రంలో బన్నీ యాక్టింగ్, సుకుమార్ డైరెక్షన్ గూస్ బంప్స్ అంటూ ఇప్పటికే అభిమానులు, సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.