Pushpa 2: ఫ్యాన్స్‌కు పూనకాలు గ్యారెంటీ..! సినిమాకే హైలెట్‌గా జాతర ఎపిసోడ్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ జాతర కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ ఆర్మీ ఎదురుచూస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

Pushpa 2:  ఫ్యాన్స్‌కు పూనకాలు గ్యారెంటీ..! సినిమాకే హైలెట్‌గా జాతర ఎపిసోడ్..
Pushpa 2
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 24, 2024 | 7:06 PM

నిన్నటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో దేవర సినిమా హంగామా నడిచింది. ఎక్కడ చూసిన ఎన్టీఆర్ పేరు, దేవర పోస్టర్స్ సందడి చేశాయి. దేవర రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ జాతర కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ ఆర్మీ ఎదురుచూస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. అంతే కాదు పుష్ప సినిమాలో బన్నీ నటనకు ఏకంగా జాతీయ అవార్డు కూడా లభించింది.

ఇది కూడా చదవండి : Uday Kiran: అంత పెద్ద హీరో.. ఆయన డెడ్ బాడీ మార్చురీ‌లో ఓ మూలన పడేశారు: ఆర్పీ పట్నాయక్ ఎమోషనల్

ఇక ఇప్పుడు పుష్ప 2 కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. ఈ సినిమా ఇప్పటికే భారీ హైప్ ను క్రియేట్ చేసింది. అలాగే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఇక  ఈ సినిమాను ముందుగా డిసెంబర్ 6న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఇప్పుడు ఈ డేట్ ను మార్చేశారు. ఒక్కరోజు ముందు అంటే డిసెంబర్ 5న పుష్ప 2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.

ఇది కూడా చదవండి : Tollywood: శ్రీదేవితో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? స్టార్ హీరోగారి భార్య కూడా ఆమె

ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ మారడంతో మూవీ టీమ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. పుష్ప సినిమాలో గంగమ్మ జాతర ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే ఈ జాతర ఎపిసోడ్ నుంచి పోస్టర్స్ ను అలాగే వీడియో ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ జాతర ఎపిసోడ్ కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడ్డారని తెలుస్తోంది.  అల్లు అర్జున్ చీర కట్టుకొని యాక్టింగ్ అలాగే యాక్షన్ ఎపిసోడ్ ఇరగదీశారంట. పుష్ప 2 నిర్మాత జాతర ఎపిసోడ్ గురించి మాట్లాడుతూ.. జాతర ఎపిసోడ్ కి బాగానే కష్టపడ్డాం. దాని కోసం 35 రోజులు షూట్ చేసాం. అలాగే 20 రోజులు వర్క్ షాప్ కూడా చేశారు. ప్రతిరోజూ బన్నీ బాడీకి పెయింట్ వేసుకొని, చీర కట్టుకొని ఆ సీన్ కోసం చాలా కష్టపడ్డారు అని చెప్పుకొచ్చారు మేకర్స్. థియేటర్స్ లో ఆ ఎపిసోడ్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయం అంటున్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.