Puri Jagannadh: ఆ రెండు సినిమాలు మహేష్‌తో చేయాలని ఉంది కానీ… ఆసక్తికర విషయం చెప్పిన పూరి

టాలీవుడ్‌లో ఒక్కొక్క దర్శకుడికి ఒకొక్క మార్క్ ఉంటుంది, ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ స్టైల్ కు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు.

Puri Jagannadh: ఆ రెండు సినిమాలు మహేష్‌తో చేయాలని ఉంది కానీ... ఆసక్తికర విషయం చెప్పిన పూరి
Puri Jagannadh
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 24, 2022 | 10:36 AM

టాలీవుడ్‌లో ఒక్కొక్క దర్శకుడికి ఒకొక్క మార్క్ ఉంటుంది, ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్(Puri Jagannadh)స్టైల్ కు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. ముఖ్యంగా యూత్ ను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంటాయి పూరి సినిమాలు. ఇక ఇప్పటివరకు పూరిజగన్నాథ్ తెరకెక్కించిన సినిమాలన్నీ ప్రేక్షకులను మెప్పించినవే.. ఇక ఇప్పుడు లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ డాషింగ్ డైరెక్టర్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ ను బాక్సర్ గా చూపించనున్నారు పూరి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లోజరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో పలు నగరాలను చుట్టేసిన లైగర్ టీమ్. వరుస ఇంటర్వ్యూలతో బిజె బిజీగా గడిపేస్తున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు పూరిజగన్నాథ్ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే మీరు మీ సినిమాల్లో ఈ సినిమాలకు సీక్వెల్స్ చేయాలనీ అనుకుంటున్నారు అని ప్రశ్న ఎదురైనప్పుడు పూరి ఆసక్తికర సమాధానం చెప్పాడు. తాను తెరకేకించిన సినిమాల్లో మహేష్ బాబు నటించిన పోకిరి, బిజినెస్ మేన్ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని ఆ రెండు సినిమాకు సీక్వెల్స్ చేయాలని ఉందని అన్నారు పూరి. మహేష్ నటించిన ఈ రెండు సినిమాలో మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక బిజినెస్ మేన్ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. మహేష్ బిజీగా ఉండటంతో ఈ సినిమా సీక్వెల్స్ చేయడం కుదరలేదు. మహేశ్ అభిమానులంతా  మరోసారి పండుగాడి రోల్ ను చూడాలనుకుంటున్నారు. అలాగే ‘బిజినెస్ మేన్’ సినిమాలో సూర్య భాయ్ పాత్రకు సీక్వెల్ నుచేయొచ్చు. మంచి స్కోప్ ఉన్న పవర్ఫుల్ రోల్ అది. ఆ రెండు సినిమాలను త్వరలో వర్కౌట్ చేయడానికే ట్రై చేస్తాను అని అన్నారు పూరి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి