కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయి సుమారు ఏడాదిన్నర గడుస్తోంది. కానీ అభిమానుల హృదయాల్లో ఆయన నిత్యం జీవించి ఉంటారు. చాలామంది ఫ్యాన్స్ పునీత్‌ను దేవుడిగా భావిస్తారు. చాలా ఇళ్లలో దేవుని ఫొటోలతో పాటు పునీత్ రాజ్‌కుమార్ ఫొటోలు, విగ్రహాలు కూడా ఏర్పాటుచేశారు. ఇక కొంతమంది ఫ్యాన్స్ పునీత్ కోసం ఏకంగా చిన్నచిన్న గుళ్లు, విగ్రహాలు కూడా కట్టేస్తున్నారు. ఇందుకు కారణం పునీత్ చేసిన సినిమాలే కారణం కాదు.. మంచి మనసుతో చేసిన ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు. ఇప్పుడు పునీత్ ఫ్యాన్స్ మరో అడుగు ముందుకేసి ‘అప్పు మాల’ వేసుకోవాలని నిర్ణయించుకున్నారు . అయ్యప్ప స్వామి మాలలాగా దీనిని కూడా భక్తిశ్రద్ధలు, నియమ నిష్టలతో వేసుకోవాలని డిసైడయ్యారు. వివరాల్లోకి వెళితే.. హోస్పేటలో పునీత్ రాజ్‌కుమార్ గుడి ఉన్న సంగతి తెలిసిందే. అక్కడినుంచే పునీత్ రాజ్‌కుమార్ మాల వేసుకోవాలని అభిమానులు నిశ్చయించుకున్నారు. ఈ మేరకు హోసపేట పునీత్ ఫ్యాన్స్ సంఘం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇందులో ప్రకారం మార్చి 1 నుంచి పునీత్ మాల కార్యక్రమం మొదలవుతుంది. మార్చి 17న మాల ముగింపు కార్యక్రమం ఉంటుంది. మార్చి 18న పునీత్ రాజ్‌కుమార్ సమాధిని సందర్శించి మాల విరమించవచ్చు. ఈ మాలను 11 రోజులు, 5 రోజులు, ఒక రోజు వేసుకోవచ్చు. ఈ మాల వేసుకునే వారు కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి. కాశాయ వస్త్రాలు ధరించాలి. పునీత్ డాలర్ ఉన్న మాలను మెడలో వేసుకోవాలి. సూర్యోదయానికి ముందు అలాగే సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత స్నానం చేయాలి. చెడు పనులకు దూరంగా ఉండాలి. ఇక మాల విరమణ సమయంలో ఇరుముడి వేసుకుని పునీత్ సమాధి దగ్గరకు వెళ్లాలి. అక్కడ మాలను తీసేయాలి. ఆ తర్వాత హంపిలోని పుణ్య నదిలో స్నానం చేసి, విరుపాక్షుడి స్వామి దర్శనం చేసుకోవాలి. ప్రస్తుతం పునీత్ మాలకు సంబంధించిన కరపత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..