కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో చిత్రపరిశ్రమ దుఃఖంలో మునిగిపోయింది. పునీత్ మరణ వార్తతో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ అభిమాన హీరో ఇక లేరనే వార్తను అటు సినీ పరిశ్రమతోపాటు.. ఇటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్న ఉదయం పునీత్ గుండెపోటుతో ఆకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. దీంతో కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. అభిమానుల సందర్శనార్థం పునీత్ రాజ్ కుమార్ పార్థివదేహాన్ని బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉంచారు. తమ అభిమాన హీరోను కడసారి చూసుకునేందుకు అభిమానులు వేలాది సంఖ్యలో తరలివస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని భాషల నటీనటులు.. అభిమానులు బరువెక్కిన గుండెతో కన్నడ పవర్ స్టార్‌కు నివాళులు అర్పిస్తున్నారు.
అయితే మందుగా పునీత్ అంత్యక్రియలు రేపు (ఆదివారం ) నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు.. తాజాగా ఈరోజు సాయంత్రం పునీత్ అంత్యక్రియలు చేయనున్నట్లుగా ప్రకటించారు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై. ఈరోజు సాయంత్రం 5 గంటలకు పునీత్ కుమార్తె బెంగళూరు చేరుకోనున్నారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో పునీత్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా సీఎం తెలిపారు. మరోవైపు టాలీవుడ్ సినీ తారలు పునీత్ అంత్యక్రియల కోసం బెంగుళూరు చేరుకుంటున్నారు. ఇప్పటికే నందమూరి నటసింహం బాలకృష్ణ .. పునీత్ పార్థివదేహానికి నివాళులర్పిస్తూ.. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంతో మందికి సాయం చేసిన పునీత్ ఇలా ఆకస్మాత్తుగా మరణించడంతో ఆయన అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు. అప్పు.. వి.. మిస్ యూ అంటూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.
ఈరోజు సాయంత్రం పునీత్ అంత్యక్రియలు కంఠీరవ స్టేడియంలో జరగనున్నాయి. ఆయన తల్లిదండ్రులు రాజ్ కుమార్, పార్వతమ్మ అంత్యక్రియలు కూడా అదే స్టేడియంలో నిర్వహించారు.
Also Read: Aryan Khan Released: ఎట్టకేలకు బయటకొచ్చిన ఆర్యన్ ఖాన్.. కొడుకు కోసం జైలుకొచ్చిన షారుఖ్..
Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‌కు ముద్దుపెట్టిన సిరి.. ఆమె బాయ్‌ఫ్రెండ్ రియాక్షన్ ఏంటంటే..
Kajol: స్టార్ హీరోయిన్ను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. కారణం తెలిస్తే మీరు కూడా షాకవుతారు..
Puneeth Rajkumar: పునీత్ అంత్యక్రియలకు టాలీవుడ్ స్టార్స్..బెంగళూరుకు పయనం..