రివ్యూ రైటర్ల ముసుగులో బ్లాక్‌మెయిల్‌ దందా.! రచ్చకెక్కిన రివ్యూల చర్చ

రివ్యూ రైటర్ల ముసుగులో బ్లాక్‌మెయిల్‌ దందా! సిన్మా రివ్యూలపై ప్రొడ్యూసర్‌ ఫైరింగ్‌.. ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌లో రివ్యూలమీద కంప్లయింట్‌.. బాయ్‌కాట్‌ బ్లాక్‌మెయిలర్స్ ట్యాగ్‌తో నిర్మాతల యుద్ధం. ఇప్పటికే ఓ వెబ్‌సైట్‌పై విరుచుకుపడ్డారు నిర్మాత రాజేష్‌ దండా. ఓ వైబ్‌సైట్‌ డిమాండ్ చేస్తున్న రేట్‌కార్డ్‌ బయటపెట్టారు రాజేష్‌. డిమాండ్ చేసినంత ఇవ్వకపోతే బాగున్న సినిమాకీ బ్యాడ్‌ రివ్యూ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నిర్మాత. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల ఉసురుపోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రివ్యూ రైటర్ల ముసుగులో బ్లాక్‌మెయిల్‌ దందా.! రచ్చకెక్కిన రివ్యూల చర్చ
Producer Rajesh Danda

Edited By: Rajeev Rayala

Updated on: Oct 22, 2025 | 6:07 PM

 

కోట్లు ఖర్చుపెట్టి నానా కష్టాలు పడి ఓ సిన్మా తీస్తే.. పరమ వేస్ట్‌ అన్నట్లు రివ్యూ వస్తే కడుపుమండిపోతుంది ఎవరికైనా. ఒకరు బాగుందంటే మరొకరు యావరేజ్‌ అని సర్టిఫికెట్‌. చూసే సాహసం చేయొద్దన్నట్లు ఇంకొందరి సమీక్షలు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న సిన్మామీద ఘోరమైన రివ్యూలొచ్చేసరికి ఫైర్‌ అయ్యారో ప్రొడ్యూసర్‌. తన సిన్మాకు పాజిటివ్‌ టాక్‌ వస్తున్నా.. ట్విట్టర్‌లో జరుగుతున్న నెగిటివ్‌ ప్రమోషన్‌తో తిట్ల దండకం అందుకున్నారు కె-ర్యాంప్‌ ప్రొడ్యూసర్‌ రాజేష్‌ దండా.

బ్రేకప్‌పై స్పందించిన రష్మిక.. అమ్మాయిలకే ఆ బాధ ఎక్కువగా ఉంటుందన్న నేషనల్ క్రష్

ఉన్నదున్నట్లు చెబితే వెల్‌కమ్‌. కానీ రివ్యూల్లో పక్షపాతం చూపిస్తున్నారనేది రాజేష్‌ దండా కంప్లయింట్‌. కొన్ని సినిమాలను నెత్తికెత్తుకుంటూ కొన్నిటిని మాత్రం కావాలనే తొక్కేస్తున్నారంటున్నారా ప్రొడ్యూసర్‌. చిన్న నిర్మాతలపై ఎందుకింత వివక్షని ప్రశ్నిస్తున్నారు. బాహుబలైనా, కె-ర్యాంప్‌ అయినా సినిమా ఒకటేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పుడు రివ్యూలపై సీరియస్‌ కావడమే కాదు.. ఏ తరహా రివ్యూకి ఎంత తీసుకుంటున్నారో రివ్యూ రేట్‌ చార్ట్‌ కూడా రిలీజ్‌ చేసి ఇండస్ట్రీలో అలజడి రేపారు రాజేష్‌ దండా.

ఇవి కూడా చదవండి

బోల్డ్ సీన్స్ దెబ్బకు బ్యాన్ చేశారు.. కట్ చేస్తే భాష మార్చి ఓటీటీలోకి వదిలారు..

రివ్యూల విషయంలో ఇండస్ట్రీలో చాలాకాలంగా డిస్కషన్‌ నడుస్తోంది. గతంలో కూడా కొందరు బాధపడ్డారు. ఇది మంచిపద్దతి కాదని చెప్పారు. కానీ రివ్యూలు ఆగడంలేదు. అన్ని రివ్యూలు కాకపోయినా.. కొన్ని రివ్యూలు బాగా తేడాగా ఉంటున్నాయనేది ఇండస్ట్రీ టాక్‌. అందుకే మంచి కలెక్షన్లు వస్తున్న తన సినిమాకి నెగిటివ్‌ రివ్యూలొచ్చేసరికి తట్టుకోలేకపోయారు రాజేష్‌దండా. పరుషపదజాలంతో విరుచుకుపడ్డారు. తన వ్యాఖ్యలు కొందరి గురించేనని వివరణ ఇస్తూనే.. రివ్యూల రచ్చపై ఇండస్ట్రీని ఏకంచేసే పనిలో పడ్డారు. త్వరలోనే ఈ విషయంపై నిర్మాతల మండలికి కంప్లయింట్‌ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మరి నిర్మాతల మండలి ఏం నిర్ణయం తీసుకుంటుందనేదానిపై అందరి దృష్టీ ఉంది.

తొలి సినిమాకు రూ.10 రెమ్యునరేషన్.. కట్ చేస్తే 300లకు పైగా మూవీస్.. ఇప్పటికే అదే అందం

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.