Jr.NTR: ‘మహానటి సినిమాలో ఎన్టీఆర్‏ను అందుకే తీసుకోలేదు’.. అసలు విషయం చెప్పిన నిర్మాత అశ్వనీదత్..

|

Aug 18, 2022 | 9:28 AM

మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్, అక్కినేని నాగచైతన్య, సమంత, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, మాళవికా నాయర్ కీలకపాత్రలలో నటించారు. అయితే అక్కినేని నాగేశ్వర్

Jr.NTR: మహానటి సినిమాలో ఎన్టీఆర్‏ను అందుకే తీసుకోలేదు.. అసలు విషయం చెప్పిన నిర్మాత అశ్వనీదత్..
Mahanati Ntr
Follow us on

డైరెక్టర్ నాగ్అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రధానపాత్రలో నటించిన చిత్రం మహానటి (Mahanati). దివంగత నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‏గా నిలిచింది. నాగ్ అశ్విన్ స్క్రీన్ ప్లై.. కీర్తి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా అలనాటి సావిత్రిని మరిపించింది కీర్తి సురేష్. ఈ సినిమాలోని ఆమె నటనకు నేషనల్ అవార్డు సొంతం చేసుకుంది. అయితే ఇందులో కీర్తి మాత్రమే కాకుండా మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్, అక్కినేని నాగచైతన్య, సమంత, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, మాళవికా నాయర్ కీలకపాత్రలలో నటించారు. అయితే అక్కినేని నాగేశ్వర్ పాత్రలో చైతూ నటించగా.. ఎన్టీఆర్ పాత్రలో వేరే వ్యక్తి నటించాల్సి వచ్చింది. ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్రను తారక్ చేయాల్సిందని.. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదని అన్నారు ప్రొడ్యూసర్ అశ్వనీదత్.

అశ్వనీదత్ మాట్లాడుతూ.. “మహానటి సినిమాలో ఎన్టీఆర్ పాత్రను జూనియర్ ఎన్టీఆర్‏తో చేయిద్దామని అనుకున్నాం. కానీ అప్పటికే బాలకృష్ణగారు ఎన్టీఆర్ బయోపిక్ ప్రకటించారు. దీంతో మా సినిమాలో ఎవరిని పెట్టి తీసినా తప్పుగా భావిస్తారేమోననిపించింది. ఒకవేళ ఎన్టీఆర్ ను పెట్టి తీసినా బాగుండదేమోనని అనుకున్నాం. ఇదే విషయాన్ని నాగ్అశ్విన్‏తో చెప్పగా.. అసలు ఎన్టీఆర్ పాత్ర లేకుండానే సినిమా చేస్తాను అన్నారు. అలా ఒకే షాట్ పెట్టాం. ఆ పామును పట్టుకునే సీన్ కూడా రామారావుగారి కెరీర్‍ ప్రారంభంలోనే నిజంగానే జరిగిందట. ఇక ఆయన పాత్రకు రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ చెప్పారు. సావిత్రి గారు, నాగేశ్వరరావు గారి కాంబోలో సినిమాలు రావడంతో చైతూ కాంబినేషన్ పై ఎక్కువ సీన్స్ తీశాం” అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.