Dil Raju: సినిమా రిలీజ్ అయిన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తాయన్నదిల్ రాజు ఆసక్తికర కామెంట్స్

|

Aug 18, 2022 | 8:29 PM

టాలీవుడ్ లో జరుగుతోన్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రొడ్యూసర్ల అంతా కలిసి సినిమా బడ్జెట్ ఎక్కువవుతుందంటూ ఆరోపిస్తూ.. సినిమా షూటింగ్ లను బంద్ చేసిన విషయం తెలిసిందే.

Dil Raju: సినిమా రిలీజ్ అయిన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తాయన్నదిల్ రాజు ఆసక్తికర కామెంట్స్
Dil Raju
Follow us on

టాలీవుడ్ లో జరుగుతోన్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రొడ్యూసర్ల అంతా కలిసి సినిమా బడ్జెట్ ఎక్కువవుతుందంటూ ఆరోపిస్తూ.. సినిమా షూటింగ్ లను బంద్ చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 1 నుంచి షూటింగ్ లను నిలిపివేశారు నిర్మాతలు. తాజాగా ఈ విషయం పై చర్చించారు ఫిలిం ఛాంబర్ సభ్యులు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు(Dil Raju) మాట్లాడుతూ.. ఓటీటీలో మూవీ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చారు . ఇక నుంచి రిలీజ్‌ అయ్యే ప్రతి మూవీ 8 వారాల తర్వాతే ఓటీటీలో రావాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పటివరకూ అగ్రిమెంట్‌ పూర్తయిన వాటిని కూడా పరిశీలిస్తున్నామన్నారు. ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న సినిమాలు, షూటింగ్‌ జరుపుకొంటున్న సినిమాలన్నీ థియేటర్‌లో విడుదలైన 8 వారాల తర్వాతే, అంటే 50 నుంచి 60 రోజుల తర్వాతే ఓటీటీలో వస్తాయన్నారు దిల్‌రాజు.

ఫిలిం ఛాంబర్‌, మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ మధ్య అగ్రిమెంట్‌ జరిగిందన్నారు దిల్‌రాజు. ఓటీటీ, టిక్కెట్‌ ధరలు, విపిఎఫ్‌ ఛార్జీలు, నిర్మాణ వ్యయంపై చర్చించామన్నారు. అలాగే థియేటర్‌, మల్టీప్లెక్స్‌లలో టికెట్‌ ధరలు, తిను బండారాల ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఇక వీపీఎఫ్‌ ఛార్జీలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. త్వరలో సినిమా షూటింగ్‌లు మొదలుపెడతామని ఆశాభావం వ్యక్తం చేశారు నిర్మాత దిల్‌రాజు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.