సాధారణ ఎన్నికలను కనిపించేలా జరిగినా ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 48 ఓట్లకు గాను 31 ఓట్లతో దిల్ రాజు ఫిలిం చాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం, ఎన్నికల ఫలితాలు రాజకీయ ఎన్నికలను తలపించాయి. ఈ ఎన్నికల కోసం జరిగిన ప్రచారాన్ని సైతం పలువురు సినిమా పెద్దలు కూడా ఇంత పెద్ద హడావిడి ఎందుకు అని ప్రశ్నించారు.
ఎట్టకేలకు ఆదివారం చాంబర్ ఎన్నికల ఫలితాలు వెలుపడ్డాయి. అధ్యక్షుడిగా దిల్ రాజు ను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాలపై దిల్ రాజు ప్యానెల్ ఆపోజిట్ ప్యానల్ అయినటువంటి సి కళ్యాణ్ ఎన్నికల ఫలితాల తర్వాత సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికకు సంబంధించి నాలుగు సెక్టార్లుగా ఎన్నికలు జరిగాయి. ప్రొడ్యూసర్ సెక్టార్, స్టూడియో సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, ఎగ్జిబిటర్ సెక్టర్.
మొదటగా ఎగ్జిబిటర్ సెక్టర్ కి సంబంధించి 16 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ప్రొడ్యూసర్, సెక్టర్ స్టూడియో సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ కి సంబంధించి ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికలు జరిగిన మూడు సెక్టార్లకు సంబంధించి ఓటర్లంతా కూడా కరెక్ట్ గా ఓట్లు వేశారని ఫలితాల తర్వాత సి కళ్యాణ్ మీడియాకు వివరించారు. కానీ ఎగ్జిబిటర్లు అమ్ముడుపోయారంటూ ఎన్నికల ఫలితాలను కామెంట్ చేశారు.
కానీ చివరగా ఎవరు గెలిచినా ఫిలిం ఛాంబర్, సినిమా అభివృద్ధికి కలిసి పని చేస్తామని.. దిల్ రాజుకు సపోర్ట్ చేస్తామని మీడియాతో మాట్లాడారు సి కళ్యాణ్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..