Bunny Vasu: నిర్మాత బన్నీ వాసు ఆవేదన.. ఏకంగా గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కు లేఖ

|

Jul 25, 2021 | 3:45 PM

సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై నిర్మాత బన్నీవాసు ఆవేదన వ్యక్తం చేశారు. ఏకంగా గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కు లేఖ రాశారు. ఇటీవల సుందర్‌పిచాయ్‌...

Bunny Vasu: నిర్మాత బన్నీ వాసు ఆవేదన.. ఏకంగా గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కు లేఖ
Bunny Vas
Follow us on

సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై నిర్మాత బన్నీవాసు ఆవేదన వ్యక్తం చేశారు. ఏకంగా గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కు లేఖ రాశారు. ఇటీవల సుందర్‌పిచాయ్‌ ఇంటర్నెట్‌ స్వేచ్ఛ మీద రాసిన ఆర్టికల్‌పై..తన అభిప్రాయాన్ని, ఆవేదనను వ్యక్త పరిచారు బన్నీ వాసు. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారంతో తాము మానసికంగా కుంగిపోతున్నామని పేర్కొన్నారు. ఇటీవల తన కూతురిని చంపుతానని ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.. ఆ వీడియోను తొలగించడానికి నానా కష్టాలు పడ్డానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమపై చేస్తున్న తప్పుడు ప్రచారానికి సంబంధించి సోషల్‌మీడియా యాజమాన్యాలకు చాలాసార్లు ఫిర్యాదు చేశానన్నారు. ఒకరు పెట్టిన పోస్టు అబద్ధమని నిరూపించడం చాలా కష్టమని.. అదేంటో స్వయంగా తాను ఫేస్‌ చేశానని వాపోతూ సుందర్‌ పిచాయ్‌కు లేఖ రాశారు.

కాగా సినీ నిర్మాత బన్నీ వాసు తనను మోసం చేశాడని ఓ మ‌హిళ పదే, పదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఆమె మానసిక స్థితి సరిగా లేదు.  ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో గతంలో కూడా చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ సదరు మహిళ చేస్తోన్న కామెంట్స్‌ను హైలెట్ చేస్తూ బన్నీ వాసుపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ‘మాకు కూడా కుటుంబాలు, బంధాలు, మనోభావాలు ఉంటాయి. ఎంత పబ్లిక్ లైఫ్‌లో ఉన్నప్పటికీ ఒక లైన్ అనేది ఉంటుంది. దాన్ని క్రాస్ చేసి మరీ వెళ్లడం కరెక్ట్ కాదు’ అనేది సినీ జనం పదే, పదే చెప్పే మాట. మున్ముందు సోషల్ మీడియా విపరీత పోకడల కట్టడికి ఎటువంటి చట్టాలు వస్తాయో చూడాలి.

బన్నీ వాసు రాసిన లేఖ దిగువన చూడండి…

Also Read: ప్రేమించాడని.. యువకుడి మర్మాంగం కోసి దారుణ హత్య

ఏడాది బుడ్డోడికి స్విమ్మింగ్ ట్రైనర్‌గా తల్లి.. నేర్పించే తీరు చూసి జనం షాక్..