Allu Aravind: టికెట్ ధరల పెంపు కోసం అడగలేదు.. అంత బెనిఫిట్ వద్దు.. అల్లు అరవింద్ కామెంట్స్..

అక్కినేని నాగచైతన్య హీరోగా డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన లేటేస్ట్ మూవీ తండేల్. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో చైతూ జోడిగా మరోసారి సాయి పల్లవి నటించింది. విడుదలకు ముందే ట్రైలర్, పాటలతో సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేసింది.

Updated on: Feb 07, 2025 | 9:31 AM

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న తండేల్ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఈరోజు (ఫిబ్రవరి 7న) తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్లలో టికెట్ రేట్లపై స్పందించారు నిర్మాత అల్లు అరవింద్. ఏపీలో టికెట్‌ ధర తక్కువగా ఉన్న కారణంగా పెంచాలని కోరామని, తెలంగాణలో పెంచాలని అడగలేదన్నారు. టికెట్ ధర 50 రూపాయలు పెంచాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరినట్లు స్పష్టం చేశారు. తండేల్ సినిమాకు బెనిఫిట్ షోలు లేవు అని అల్లు అరవింద్‌ స్పష్టం చేసారు.

“ఏపీలో మాత్రమే తండేల్ టికెట్ ధరల పెంపు కోసం అడిగాం. తెలంగాణలో టికెట్ ధరల పెంపు కోసం అడగలేదు. తెలంగాణలో ఇప్పటికే టికెట్ ధరలు పెరిగి ఉన్నాయి. టికెట్ ధరలు రూ.50 పెంచమనే ఏపీ ప్రభుత్వాన్ని అడిగాం. తెలంగాణలో రూ.295, రూ. 395 పెరిగి ఉన్నాయి. తండేల్ బెనిఫిట్ షోలు లేవు, అంత బెనిఫిట్ మాకు వద్దు” అని అన్నారు.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన