Priyamani: ఏంటీ.. ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియమణికి సిస్టర్ అవుతుందా..? వీరిద్దరూ కజిన్స్ ?..

| Edited By: Ravi Kiran

Oct 10, 2024 | 9:18 PM

పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ.. ఇప్పుడిప్పుడే సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రియమణికి సంబంధించిన ఓ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ప్రియమణికి బాలీవుడ్ ఇండస్ట్రీలో కజిన్ ఉన్నారట. అవును.. ఆమె కూడా అక్కడ స్టార్ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరంటే హీరోయిన్

Priyamani: ఏంటీ.. ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియమణికి సిస్టర్ అవుతుందా..? వీరిద్దరూ కజిన్స్ ?..
Priyamani
Follow us on

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ ప్రియమణి. అతనొక్కడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస సినిమాలతో అలరించింది. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. కేవలం గ్లామర్ షోస్ మాత్రమే కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. తెలుగు, తమిళం బాషలలో అనేక చిత్రాల్లో నటించిన ప్రియమణి.. హిందీలో పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ.. ఇప్పుడిప్పుడే సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రియమణికి సంబంధించిన ఓ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ప్రియమణికి బాలీవుడ్ ఇండస్ట్రీలో కజిన్ ఉన్నారట. అవును.. ఆమె కూడా అక్కడ స్టార్ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరంటే హీరోయిన్ విద్యా బాలన్.

ప్రియమణి, విద్యాబాలన్‌లు చాలా మంది అభిమానులను కలిగి ఉన్న ప్రముఖ తారలు. వీరిద్దరూ బలమైన పాత్రల ద్వారా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ప్రియమణి చెప్పిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యాబాలన్, తాను దగ్గరి బంధువులే అని తెలిపింది. ఒక ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ.. తన తాతయ్యతో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చింది. విద్యాబాలన్ తన తండ్రి వైపు నుండి తన రెండవ కోడలు అని చెప్పింది. అయితే ఇప్పటి వరకు మనం ఒకరినొకరు రెండు సార్లు మాత్రమే చూశామని తెలిపింది. మొదటగా ఓ అవార్డు వేడుకలో కనిపించిందని.. ఆరోజు విద్యాబాలన్ తనకు అవార్డ్ అందించిందని తెలిపింది. విశాఖపట్నంలో జరిగిన ఒక అవార్డు వేడుకలో తాము తొలిసారిగా కలుసుకున్నామని తెలిపింది.

ఇవి కూడా చదవండి

షారుఖ్ ఖాన్ పుట్టినరోజు వేడుకలో రెండవ సారి కలుసుకున్నామని తెలిపింది. అప్పుడు కూడా విద్య ప్రేమగా ప్రవర్తించిందని ప్రియా గుర్తు చేసుకున్నారు. తనకు విద్యతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, ఆమె ముంబైకి వెళ్లినప్పుడల్లా విద్య తండ్రిని చూస్తానని ప్రియా మణి ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.